అమూల్ కోసం అధికార దుర్వినియోగం

గుంటూరు జిల్లాలో అమూల్ డెయిరీకి పాలు పోయించడం లేదని 12 మంది పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయితీ అధికారి కేశవరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అమూల్ డెయిరీకి పాలు పోయడానికి రైతులు ఒప్పుకోవడం లేదని, దానికి మేమేం చేస్తామని, ఇష్టంలేనివారిచేత బలవంతంగా ఎలా పాలుపోయిస్తామంటూ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమూల్ డెయిరీకి పాలు పోయించడానికి నోడల్ అధికారులుగా జిల్లావ్యాప్తంగా పంచాయితీ కార్యదర్శులను నియమించారు. గుంటూరు జిల్లాలో అగ్రగామిగా ఉన్న సంగం డెయిరీని దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతులకు వారికన్నా ఎక్కువ బోనస్ ఇవ్వాలని అమూల్‌పై ఒత్తిడి తెస్తోంది. అలా తీసుకురావడంద్వారా రైతులను ఆకట్టుకోవచ్చని, సంగం డెయిరీని దెబ్బతీయవచ్చని ప్రభుత్వ భావన గా ఉందంటూ సంగం డెయిరీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.