వాహనాలపై పోలీస్ ,ప్రెస్ స్టిక్కర్లపై నిఘా

వాహనాలపై విశాఖ పోలీసుల స్పెషల్ డ్రైవ్…

విశాఖ:

బైక్,కార్లపై ఎమ్మెల్యే, ఎంపీ ,పోలీస్, ప్రెస్, స్టిక్కర్లు అనధికారికంగా అతికించుకుని పోలీస్ కాకున్నా, విలేకరిగా పనిచేయకున్నా ఆ స్టిక్కర్లేసుకుని యమ దర్జాగా వాహనాలు నడుపుతున్నారా.విశాఖ పోలీసులు అలాంటి వాహనదారులకు చెక్ పెడుతున్నారు.స్పెషల్ డ్రైవ్ లో ఇప్పటికే వందల మంది అసలు సిసలు కాని పోలీసులు, విలేఖరులు అడ్డంగా దొరికిపోయారు. మొదటి సారి వార్నింగ్ తో సరిపెట్టినా.. మరోసారి రిపీట్ అయితే మాత్రం ఊచలు లెక్కపెట్టాల్సిందే.
నగరంలో వాహనాలు వేల సంఖ్యలో ఉంటాయి. అందులో పోలీస్, ప్రెస్ స్టిక్కర్లున్న బండ్లు కొకొల్లలు. టూ వీలర్ నుంచి మొదలుపెడితే కాస్ట్లీ కార్ల వరకు ఆ స్టిక్కర్లు కనిపిస్తాయి. వాస్తవానికి అసలైన పోలీసులు గానీ, విలేఖరులు గానీ చాలామంది వారి వాహనాలకు అలాంటి స్టిక్కర్లు వేసుకొని పరిస్థితి. అయితే కొందరు ఖాకీ ఉద్యోగం వెలగబెట్టకున్నా, విలేకరులుగా పనిచేయకున్నా.. దర్జాగా పోలీస్, స్టిక్కర్లు వేసుకుని రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు.

ఎవరు అసలు పోలీసులో, ఎవరు అసలు విలేకరులో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ క్రమంలో పోలీసులు స్టిక్కర్ల భాగోతంపై దృష్టి పెట్టారు. ఇటీవల కొన్ని పోలీస్ స్టిక్కర్ తో ఉన్న వాహనాలను ఆపి తనిఖీ చేయగా.. వారికి డిపార్టుమెంటుతో సంబంధం లేదనే విషయం బయటపడింది. దాంతో సదరు వాహనదారుల నుంచి తప్పయిందనే సంజాయిషీ పత్రం రాయించుకొని.. మరోసారి ఇది రిపీట్ కాబోదంటూ హామీ తీసుకుని వదిలేశారు పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.