ఆశించినంతగా ఆకట్టుకోని ‘టక్ జగదీష్’

శివ దర్శకత్వంలో తెరకెక్కిన నిన్ను కోరి, మజిలీ సినిమాలు హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా టక్ జగదీష్ సినిమాకు మాత్రం ప్రేక్షకుల నుంచి అనుకున్నంత స్పందన రాలేదు. సరికదా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

రొటీన్ కథను శివ నిర్వాణ తెరకెక్కించారని, సినిమా కథను బ్రహ్మోత్సవం సినిమాలా సాగదీశారని, కథలో కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉందని నెటిజన్లు ఈ సినిమాపై సెటైర్లు వేయడంతో పాటు ఈ సినిమా గురించి మీమ్స్ వైరల్ కావడం గమనార్హం. అయితే ఈ సినిమా ఓటీటీలో ఊహించని రికార్డులను క్రియేట్ చేసింది.

తెలుగు భాషకు సంబంధించి ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది వీక్షించిన సినిమా టక్ జగదీష్ కాగా విడుదలైన ఐదు రోజులకే టక్ జగదీష్ ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఫ్లాప్ అన్న టక్ జగదీష్ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ ను అందుకుంది. నాని గత సినిమా ‘వి’ సినిమాకు కూడా ఫ్లాప్ టాక్ వచ్చినా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ టక్ జగదీష్ హక్కులను ఏకంగా 37 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

నాని సినిమాలు ఓటీటీలలో రికార్డులు క్రియేట్ చేస్తూ నానికి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుతున్నాయి. నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలతో బిజీగా ఉండగా నాని హీరోగా ‘దసరా’ పేరుతో’ ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. వరుసగా కొత్త సినిమాలకు కమిటవుతూ ఏడాదికి రెండు సినిమాలు రిలీజయ్యేలా నాని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.