రేపే తెలుగు బిగ్ బాస్ – 5 ప్రారంభం… కంటెస్టెంట్ల పైనల్ లిస్ట్ ఇదే!

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో మరోసారి సందడి చేయబోతోంది. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ సక్సెస్ ఫుల్ గా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ – 5 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీజన్ కు కూడా ప్రముఖ సినీ నటుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సీజన్ – 5 రేపు ప్రారంభం కాబోతోంది. దీంతో, కంటెస్టెంట్లను ఈరోజే హౌస్ లోకి నిర్వాహకులు పంపుతున్నారు.

కంటెస్టెంట్లంతా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్, మారియట్ హోటళ్లలో క్వారంటైన్ లో ఉన్నారు. వీరంతా ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. రేపు సాయంత్రం బిగ్ బాస్ -5 తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్లు వీరే:
యాంకర్ రవి, యానీ మాస్టర్, యూట్యూబర్ సరయు, రేడియో జాకీ కాజల్, సీరియల్ హీరో మానస్, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టర్, నటి శ్వేత వర్మ, లహరి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్.

Leave A Reply

Your email address will not be published.