అప్పులు , వడ్డీల లెక్కలు చెప్పండి: ఏపికి ‘కాగ్’ లేఖ!

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి ప్రిన్సిపల్ ఆడిటర్ జనరల్ కార్యాలయం లేఖ రాసింది. కార్పొరేషన్ల ద్వారా తీసుకువచ్చిన రుణాల వివరాలను పంపాలని ఆదేశించింది.

ప్రస్తుతం చెల్లిస్తున్న వడ్డీ, ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ వివరాలను తెలపాలని కాగ్‌ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆడిటర్ జనరల్ కార్యాలయం లేఖ రాసింది. అప్పులను చెల్లించేందుకు ఉన్న ఆదాయ వనరులేంటని ఆడిటర్ జనరల్ అడిగింది. బడ్జెట్‌లో ఎందుకు చూపించలేదని ప్రభుత్వాన్ని కాగ్ ప్రశ్నించింది.

నెలకు ఎంత మొత్తంలో వడ్డీ చెల్లిస్తున్నారని కాగ్ అధికారులు అడిగారు. కాగ్ లేఖపై సమాధానం ఇచ్చేందుకు ఏపీ ఆర్థికశాఖ సిద్ధమౌతోంది. ఆర్థికశాఖలో కార్పొరేషన్ అప్పులపై అధికారులు తర్జనభర్జనలు పడుతోన్నారు. కార్పొరేషన్ అప్పులపై సమాచారమిస్తే భవిష్యత్తులో రుణాల సంగతేంటని ఆందోళన చెందుతున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.