మిలియన్ డాలర్ల క్లబ్ లో ‘లవ్ స్టోరీ’

 

సాయిపల్లవి , నాగచైతన్య తో నటించిన ‘ ‘లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ భారీగానే వున్నాయి.

మొదటి నుంచీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా బాగానేవుంది.

తొలి రోజు అంటే సెప్టెంబర్ 24 న తెలంగాణలో రూ.3 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. 25న రెండో రోజు రూ.2.6 కోట్లు కొల్లగొట్టింది. మూడోరోజు 26న ఇంతే స్థాయిలో కలెక్షన్లు వచ్చినట్టు పరిశ్రమ వర్గాల సమాచారం . అలాగే ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ ఉన్నప్పటికీ ఈ మూవీ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. అక్కడ మొత్తం రెండు రోజుల షేర్ రూ.6 కోట్లకు పైగా ఉందని సమాచారం.

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకుగానూ రూ.12 కోట్లను రాబట్టిందట. ఇక యూఎస్‌లోనూ లవ్ స్టోరీ భారీ కలెక్షన్స్‌తో దుమ్మ దులిపేస్తుంది. ప్రిమియర్లు, తొలి రోజు వసూళ్లతోనే 6 లక్షల డాలర్ల మార్కును దాటేసిన ఈ సినిమా.. శనివారం 2.88 లక్షల డాలర్లును అందుకుని బాక్సాఫీస్‌ను హీటెక్కించేసింది. ఇక ఆదివారం కలెక్షన్స్‌తో ఈ చిత్రంలో మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిపోబోతోందని సమాచారం. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి హాజరైయ్యారు .

Leave A Reply

Your email address will not be published.