అద్దెకు ఆర్టీసీ ఖాళీ స్ధలాలు: 24న కీలక సమావేశం

ఔత్సాహిక వ్యాపారవేత్తలతో సమావేశాలు

అమరావతి: ఆదాయం పెంచుకునే ప్రక్రియలో భాగంగా ఆర్టీసీ ఉపయోగంలోలేని ఖాళీ స్ధలాలను అద్దెకు ఇచ్చే ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలోని తొమ్మిది చోట్ల ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను నిర్మించు, నిర్వహించు, బదలాయించు (బీవోటీ), ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో లీజుకు ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు.
విశాఖ జిల్లా తగరపువలసలో 4,259 చదరపు గజాలు, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 12,642, గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 3,415, తెనాలిలో 2,500, నరసరావుపేటలో 1,542, బాపట్లలో 2,388, నెల్లూరు జిల్లా గూడూరులో 4,075, అనంతపురం జిల్లా హిందూపురంలో 2,200, ఉరవకొండలో 1,760 చదరపు గజాలను లీజుకు ఇవ్వనున్నారు. వీటిపై తొలుత ఔత్సాహిక వ్యాపారవేత్తలతో ఈ నెల 24న విశాఖలో సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ స్థలాలను 33 ఏళ్లకు లీజుకు ఇవ్వనున్నారు.

Leave A Reply

Your email address will not be published.