మళ్ళీ తెరపైకి రెజీనా….అభిమానుల్లో ఆశలు

యువతార రెజీనా ఈ మధ్య ఎక్కువగా సినిమాల్లో కనబడటం లేదు అన్నది ఫిలిం సర్కిల్స్‌లో బాగా వినిపిస్తున్న మాట. రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన రెజీనా కాసాండ్రా ఈ మధ్యకాలంలో తెరపైకి రావడంలేదు. కారణాలు ఏవైన ఈ భామ హావభావాలతో యువతను ఆకట్టుకునేది. గత కొంతకాలంగా ఆమె తెర వెనుకే వుంది. మళ్ళీ పుంజుకునే రోజులు వస్తున్నాయన్నది పరిశ్రమ మాట. అందం-అభినయం ఉన్న ఈ భామకు సడన్‌గా ఆఫర్లు తగ్గిపోవడంతో ఈ అమ్మడి అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇక ఇప్పుడు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. కార్తీక్ రాజు దర్శకత్వంలో ఓ హరర్ సినిమా చేస్తుంది రెజీనా. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను  చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.

ఒక మర్డర్ కేసు విచారణ చేస్తుండగా .. అది దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనతో మళ్లీ ఇప్పుడు జరుగుతుందని ఆ విచారణలో తెలుస్తుంది. పురావస్తుశాఖలో పనిచేస్తున్న హీరోయిన్ ఈ కేసును ఛేదించడానికి పోలీసులకు సాయం చేస్తుంది. అయితే 100 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన ఏంటి..? మళ్లీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది.? అనేది సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మిస్టరీ థ్రిల్లర్‌ను తమిళంలో ‘సూర్పనగై’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రెజీనా మరో హిట్ అందుకుంటుందేమోనని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్ర విజయం ఖాయంగా కనిపిస్తుంది.

 

Leave A Reply

Your email address will not be published.