నవంబర్ 7 నుంచి రామాయ‌ణ్ ఎక్స్‌ప్రెస్ రైలు

ఖో అప్నా దేశ్ అనే పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఇన్షియేటివ్‌లో భాగంగా భార‌తీయ రైల్వేలు ప్రత్యేక పర్యాటక రైళ్ల సేవ‌ల‌ను ప్రారంభించింది. దేశంలో ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్స‌హించ‌డంలో భాగంగా ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (ఐఆర్సీటీసీ) శ్రీ రామాయ‌ణ్ యాత్ర పేరుతో డీల‌క్స్ ఏసీ టూరిస్ట్ రైలును ప్రారంభిస్తోంది.

17 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో శ్రీరాముడి భ‌క్తులు దేశంలోని అధ్యాత్మిక కేంద్రాల‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. న‌వంబ‌ర్ 7వ  తేదీన ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్‌జంగ్ రైల్వే స్టేష‌న్ నుంచి రామాయ‌ణ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం అవుతుంది. ఈ యాత్ర‌లో పాల్గొనే ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో త‌మ టికెట్ల‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌యాణికులంతా కరోనా రెండు డోస్‌ల టీకాలు వేసుకున్న స‌ర్టిఫికెట్లు వెంట తెచ్చుకోవాలి. ఈ యాత్ర‌లో ప్ర‌యాణికులు సుమారు 7,500 కి.మీ. దూరం ప్ర‌యాణిస్తారు.

సందర్శించే ఆధ్యాత్మిక కేంద్రాలు 

అయోధ్య: రామ‌జ‌న్మ‌భూమి దేవాల‌యం, హ‌నుమాన్ గ‌ఢీ, స‌ర‌యు ఘాట్‌
నందిగ్రామ్‌: భార‌త్‌-హ‌నుమాన్ టెంపుల్‌, భార‌త్ కుంద్‌
జ‌న‌క్ పూర్: రామ్ జ‌న‌క్ మందిర్‌
సీతా మ‌ర్హి: సీతామ‌ర్హిలోని జాన‌కి మందిర్‌, పునౌరా ధామ్‌
వార‌ణాసి: తుల‌సి మాన‌స్ టెంపుల్‌, సంక‌ట్ మోచ‌న్ టెంపు, విశ్వ‌నాథ్ టెంపుల్‌, సీతా సామాహిత్ స్థ‌ల్‌, సీతామ‌ర్హిలోని సీతా మాతా టెంపుల్‌.
ప్ర‌యాగ్‌: భ‌ర‌ద్వాజ్ ఆశ్ర‌మం, గంగా య‌మున సంగ‌మం, హ‌నుమాన్ దేవాల‌యం
శ్రీంగ‌వేర్పూర్: శ్రింఘే రిషి స‌మాధి అండ్ శాంతాదేవి టెంపుల్‌, రామ్ చౌరా
చిత్ర‌కూట్: గుప్త గోదావ‌రి, రామ్‌ఘాట్‌, భార‌త్ మిలాప్ టెంపుల్‌, స‌తి అన‌సూయ టెంపుల్‌
నాసిక్‌: త్రయంబ‌కేశ్వ‌ర్ టెంపుల్‌, పంచ‌వ‌టి, సీతా గుఫా, క‌ల‌రామ్ టెంపుల్‌
హంపి: అంజ‌నాద్రి హిల్‌, రిషిముఖ్ ఐలాండ్‌, సుగ్రీవ గుహ‌, చింతామ‌ణి టెంపుల్‌, మాల్య‌వంత ర‌ఘునాథ్ టెంపుల్.
రామేశ్వ‌రం: శివ టెంపుల్‌, ధ‌నుస్కోటి

రామాయ‌ణ ఎక్స్ ప్రెస్ రైలు మొదటగా అయోధ్య‌లో ఆగుతుంది.  అక్క‌డి శ్రీ‌రామ జ‌న్మ‌భూమి టెంపుల్‌, హునుమాన్ టెంపుల్‌ను, నందిగ్రామ్‌లోని భార‌త్ మందిర్‌ను సంద‌ర్శించొచ్చు. అక్క‌డ నుంచి బీహార్‌లోని సీతామ‌ర్హికి వెళుతుంది. సీతా మ‌ర్హిలో సీత జ‌న్మ‌స్థ‌లం, నేపాల్‌లోని జ‌న‌క్‌పూర్‌లో రాం-జాన‌కి టెంపుల్‌ను సంద‌ర్శిస్తారు.

సీతామ‌ర్హి త‌ర్వాత వార‌ణాసికి వెళుతుంది ఈ ఎక్స్‌ప్రెస్ రైలు. వార‌ణాసి, ప్ర‌యాగ్‌, శృంగ‌వేర్పూర్ ఆల‌యాల‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. అక్క‌డ నుంచి రోడ్డు మార్గంలో చిత్ర‌కూట్ వెళ్లొచ్చు. ఈ నాలుగు కేంద్రాల్లో రాత్రి బ‌స ఏర్పాటు చేస్తారు. అక్క‌డ నుంచి నాసిక్‌, హంపి మీదుగా రామేశ్వ‌రానికి రామాయ‌ణ ఎక్స్ ప్రెస్ రైలు చేరుకుంటుంది.

ఫ‌స్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో ప్ర‌యాణం చేయొచ్చు. 8 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లోని హోట‌ళ్లు, మ‌రో 8 రాత్రులు సంబంధిత రైల్ కోచ్‌ల్లో బ‌స చేయొచ్చు. రైల్వే రెస్టారెంట్ల నుంచి ఆన్ బోర్డ్ వెజిటేరియ‌న్ భోజ‌న వ‌స‌తి క‌ల్పిస్తారు. ఏసీ వాహ‌నాల్లోనూ ఆయా ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించ‌ వ‌చ్చు. ప్ర‌యాణికులంద‌రికీ పర్యాటక భీమా  సౌక‌ర్యం ఉంటుంది. ప్ర‌యాణికుల‌కు పూర్తి భ‌ద్ర‌త క‌ల్పిస్తారు.

Leave A Reply

Your email address will not be published.