తహసీల్దార్ అధికారాలు మీరెందుకు వాడుతున్నారు

ఏపి పోలీసులకు హైకోర్టు ప్రశ్న: వాడొద్దని హెచ్చరిక

అమరావతి: సమాజంలో అల్లర్లను సృష్టించే వారిని సీఆర్‌పీసీ సెక్షన్‌-107 కింద బైండోవర్‌ చేసే అధికారం తహసీల్దార్లకు ఉందని.. వారి అధికారాన్ని పోలీసులు లాగేసుకుంటున్నారని అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన పరశురాములు అనే పిటిషనర్‌ హైకోర్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సెక్షన్‌-107 కింద పోలీసులు లక్షల మందిపై కేసులు పెడుతున్నారని కోర్టుకు వివరించారు.

వాదనలు విన్న న్యాయస్థానం సీఆర్‌పీసీ సెక్షన్‌-107 కింద కేసులు నమోదు చేయొద్దని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని పీఎస్‌ల ఎస్‌ఐలకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పిటిషనర్‌పై ఆత్మకూరు పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టేసింది.

సిఆర్‌పీసీ సెక్షన్‌-107 కింద నమోదైన కేసును కొట్టివేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌లో సీఆర్‌పీసీ సెక్షన్‌-107 కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని పరశురాములు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.

Leave A Reply

Your email address will not be published.