వైసిపి నాయకులను తరమి కొట్టాలి: పవాన్

జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘నాకు సినిమా అన్నం పెట్టిన తల్లి.. సినిమా పరిశ్రమను తక్కువ చేయడం లేదు.. కానీ, రాజకీయాల్లోకి నచ్చి వచ్చా.. నేను సినిమా హీరోను కాదు.. నేను నటుడిని కావాలని కూడా కోరుకోలేదు.. కానీ, సాటి మనిషికి అన్యాయం జరిగితే.. స్పందించే గుణం నాలో ఉంది.. మీకు యుద్ధం ఎలా కావాలో చెప్పండి.. ప్రజాస్వామ్య పద్ధతిలోనైనా సిద్ధం.. మరో విధంగా అయినా రెడీ.. మీరు తిట్టే కొద్దీ ఇంకా బలపడుతాను. సమస్యలని ప్రస్తావిస్తే.. మా ఆడపడుచుల గురించి మాట్లాడతారా..?. ఎవర్నీ మర్చిపోను, గుర్తుపెట్టుకొంటా’ అంటూ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

‘నాకేమన్నా థియేటర్లు ఉన్నాయా..? మీ వైసీపీ నేతలకే ఉన్నాయి. కాకినాడ, నెల్లూరుల్లో థియేటర్లు ఎవరివి మీ వారివి కావా..? సినిమా టిక్కెట్లు ఎంతైనా పెట్టుకోని చావండి.. నాకేం అభ్యంతరం లేదు. మా కష్టార్జితంపై మీ పెత్తనం ఏంటీ..? భారతీ సిమెంట్సును పంచండి. ఓ పని చేయండి.. ఇళ్లల్లోకి వచ్చి మా బంగారాన్ని లాగేసుకోండి. వైసీపీ వాళ్లు మాట్లాడ్డం ఎప్పుడు నేర్చుకుంటారు..? అరవడం తప్ప..’ అంటూ పవన్ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వివేకా హత్య కేసుపై అడిగితే.. నా వ్యక్తిగతం గూర్చి మాట్లాడుతున్నారు. కోడి కత్తి ఘటన చేసింది ఎవరు..? ప్రతి సన్యాసితో నేను ఎందుకు తిట్టించుకోవాలి..? నా వ్యక్తిగత జీవితంపై కూడా జగన్ చాలా సార్లు మాట్లాడారు. నేను మాట్లాడలేక కాదు. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పించారు. మీరు తిట్టిన కొద్దీ నేను బలపడతాను, తప్ప బలహీనపడను. ఎవర్నీ మర్చిపోను, గుర్తుపెట్టుకొంటా..! ఎవర్నీ ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసు.. రాజకీయాల్లో కలుపుమొక్కల్ని తీసేయాలి.

మా నాన్న సీఎం కాదు.. మా మామ సీఎం కాదు. మా నాన్న నాకు ఇడుపులపాయ లాంటి ఎస్టేట్ ఇవ్వలేదు. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం ఉంది. యోగ మార్గంలోకి వెళ్లిన నన్ను.. బాధ్యతలు తప్పించుకుంటున్నావని అంటే తప్పని సరి పరిస్థితుల్లో సినిమాల్లోకి వచ్చాను. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాను’ అని పవన్ తెలిపారు.

భవిష్యత్తులో ప్రభుత్వం మారడం ఖాయం.. 151 సీట్లు వచ్చిన వైసీపీకి 15 సీట్లే రావచ్చునని పవన్ తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఢంకా బజాయించి గెలుస్తుంది. అప్పుడు పాండవుల సభ ఎలా ఉంటుందో చూపిస్తా.. వైసీపీ నేతలకు సవాల్ విసురుతున్నా. ఏం చేస్తారో చేసుకోండి. తాటతీసి మోకాళ్ల మీద నించోబెడతా.. ప్రతి ఒక్కటి గుర్తుంచుకుంటా.. కాకినాడలో మా ఆడపడుచు మీద చేయి వేశారు. ప్రతి ఒక్కటి గుర్తుంది. మీరు బీహార్ నుంచి కిరాయి రౌడీలను తెప్పించుకోండి.. మేం భయపడతాం’ అంటూ పవన్ వైసీపీ నేతలను హెచ్చరించారు.

‘ఎంత సేపు రాజకీయం రెండు కులాల మధ్యనేనా..? మిగతా వాళ్ల పరిస్థితేంటీ..? వాళ్లకు అధికారం వద్దా..? ఒక్క కులమే శాసిస్తామంటే సరికాదు.. అందరూ ఉండాలి. అధికారం లేని అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటుంది. వైసీపీ కక్ష కట్టి కమ్మ వారిపై దాడి చేయడం సమంజసమా..? కశ్మీర్లో పండిట్లను తరిమేసినట్టు.. ఓ జాతిని రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారు. దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టిన పరిస్థితి వచ్చిందంటే.. మీరిక రాష్ట్రంలో ఉండకూడదు’ అంటూ పవన్ వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Leave A Reply

Your email address will not be published.