ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రగతిపై దుమ్మెత్తిన పవన్

వైసీపీ పాలనలో రెండున్నరేళ్లలో రాష్ట్రంలో జరిగిన ప్రగతి ఇదేనంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ‘ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!.. హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.. ఎక్కడున్నారు పాలకులంటూ.. పవన్‌ విమర్శలు సంధించారు. వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’ కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయిందంటూ మరో ట్విట్‌ చేశారు పవన్‌ కల్యాణ్‌. వాలంటీర్ ఫెలిసిటేషన్ – 261 కోట్లని పవన్‌ పేర్కొన్నారు. 450 కోట్లు భవన నిర్మాణ కార్మికుల ఫండ్ మళ్లించలేదా అంటూ జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. పాలసీ టెర్రరిజం, ఏపీ వాణిజ్యం ఏకస్వామ్యంగా మారగలదా అని పేర్కొన్నారు. ఎవరికి ఏ మౌలిక సదుపాయాలు లేవని పేర్కొన్నారు.

రేషన్ కోసం ఏర్పాటు చేసిన డెలివరీ వ్యాన్లు ఎవరి కోసం, రివర్స్ టెండర్ ఆర్టికల్ 19 (1) (గ్రా) పోలవరం పురోగతి ఏది?.. అంటూ ప్రశ్నించారు. అమరావతి రైతులు, సరస్వతి పవర్, పరిశ్రమలను మోసం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం సిమెంట్‌ను ఆన్‌లైన్‌లో విక్రయిస్తుందా? .. ఇప్పటికే సిమెంట్ కంపెనీలు 25,000 కోట్ల లాభాన్ని ఆర్జించాయని పేర్కొన్నారు. ఏపీఎస్‌డీసీఎల్‌సి ప్రపంచ బ్యాంక్ రుణాన్ని నిలిపివేసిందని పేర్కొన్నారు. ఏపీ సంపద లేదని జనరేషన్ రుణ హక్కును రద్దు చేసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన లేదని.. నవరత్నాలు కాదు.. నవ కష్టాల పాలసీ టెర్రర్ అంటూ పవన్‌ పేర్కొన్నారు. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం చేసిన పాలసీ టెర్రరిజానికి ఉదాహరణలు అంటూ పవన్‌ విరుచుకుపడ్డారు.

కాగా.. సాయిధరమ్‌ తేజ్‌ నటించిన ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అప్పటి నుంచి వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతూన్న సంగతి తెలిసిందే.

ధ్వజమెత్తిన లక్మ్షిపార్వతి

తాజాగా ఏపీ తెలుగు,సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతీ పవన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ సొంతంగా ప్రజల్లోకి వెళితే తప్ప నాయకుడు కాలేరని.. ఆయన విష వృక్షం నీడలో ఉన్నారని పేర్కొన్నారు. అక్కడి నుంచి బయటకు వస్తే తప్ప ముందుకు వెళ్లలేరని చెప్పారు. పది అడుగుల పాదయాత్ర చేసి.. జనం ఎక్కువగా కనిపిస్తే కారు ఎక్కే పవన్.. జగన్ మాదిరిగా ప్రజల్లో ఉంటూ సుదీర్ఘ పాదయాత్ర చేయగలరా అని ప్రశ్నించారు. అసలు పవన్ తాను ఏ సిద్దాంతం ఎన్నుకున్నారో ఆయనకే స్పష్టత లేదన్నారు. కమ్యూనిస్టులు, టీడీపీలతో కలిసి పనిచేసిన వ్యక్తి… టీడీపీ చేసిన తప్పులను ఎత్తి చూపలేకపోవడం ఏంటని ప్రశ్నించారు.

ప్రభుత్వం సినీ పెద్దలతో చర్చించిన తర్వాతే ఆన్‌లైన్ టికెట్ల ప్రక్రియపై నిర్ణయం తీసుకుందన్నారు. ఒక నాయకుడిగా ముందుకు వెళ్లాలనుకుంటున్న పవన్.. దొంగ టికెట్ల అమ్మకాలకు మద్దతుగా నిలిస్తే లీడర్ ఎలా అవుతారని లక్ష్మీ పార్వతీ ప్రశ్నించారు. నాయకులు అయిన వాళ్లు మంచి వైపు నిలబడాలని.. జగన్ ప్రభుత్వం ఏం తప్పు చేసిందని ఆయన మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం మానుకోవాలని హితవు పలికారు. జగన్‌కు ప్రజల మద్దతు ఉందని.. ఆయన జోలికి ఎవరూ రాలేరని స్పష్టం చేశారు. ఎన్నికల్లో వరుస విజయాలు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఘాటు వ్యాఖ్యలు

క్యారెక్టర్ లేని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం తన వ్యక్తిత్వానికే లోటు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. మహిళలపై అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్న జనసేన అధినేత పవన్ తన ద్వారా నష్టపోయిన మహిళల గురించి ముందు మాట్లాడాలన్నారు. పవన్‌కు మనసనేదేలేదు.. ఆయన మహిళలను ఏవిధంగా హింసించారో ప్రజలే చూస్తున్నారు. కులాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ లాంటి వాడు ప్రజా నాయకుడు కాకూడదని రెండు చోట్ల ప్రజలే తిరుస్కరించారు అని నారాయణ స్వామి తిరుపతిలో చెప్పుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.