అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ మ్యాజిక్ పనిచేయదు

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ 2024లో మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని అయితే రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో ను , అసెంబ్లీ ఎన్నికల్లో స్ధానిక నాయకత్వమే పోరాటం చేసి గెలవాలని మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప కార్యకర్తల సమావేశంలో పేర్కొనడం సంచలనం కలిగించింది. కర్నాటక లో కాంగ్రెస్ ను తక్కువగా అంచనా వేయకూడదని కూడా ఆయన అన్నారు.

రాష్ట్రంలో మోడీ ఛరిష్మా పనిచేయదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు దూమరం రేపుతున్నాయి. మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప మీద కర్ణాటక బీజేపీ నాయకులతో పాటు జాతీయస్థాయి బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి బీఎస్. యడియూరప్పను బలవంతంగా కిందకు దింపిన తరువాత ఆయన మొదటిసారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలు బీజేపీ నాయకుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టుకుని వచ్చే శాసనసభ ఎన్నికల్లో మనం గెలవలేము, గల్లీ లీడర్స్ తోనే మనం అధికారంలోకి వస్తామని యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు దూమరం రేపాయి. మాజీ సీఎం యడియూరప్ప చేసిన వ్యాఖ్యలకు ఆయన వర్గీయులు మద్దతు ఇవ్వడం, కొందరు బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మాజీ సీఎం యడియూరప్పతో కేంద్రం పెద్దలు మాట్లాడుతారని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు. మాజీ సీఎం యడియూరప్ప చేసిన వ్యాఖ్యలపై ఆయన కొడుకు కూడా స్పందించారు.

సీఎం పదవి పోయిన తరువాత ?

కర్ణాటక బీజేపీలో బీఎస్. యడియూరప్ప చెరగని ముద్ర వేసుకున్నారు. ఇటీవల బీఎస్, యడియూరప్పను ముఖ్యమంత్రి కుర్చీ నుంచి బలవంతంగా కిందకు దించిన విషయం తెలిసిందే. యడియూరప్ప స్థానంలో బసవరాజ్ బోమ్మయ్ ను కుర్చోబెట్టడంతో అప్పటి నుంచి యడియూరప్ప మౌనంగా ఉన్నారు.

మోదీని టార్గెట్ చేసి బాంబు పేల్చిన అప్ప

సీఎం కుర్చీ నుంచి దిగిపోయిన తరువాత బీఎస్. యడియూరప్ప బీజేపీ హైకమాండ్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు. రెండు రోజుల పాటు కర్ణాటకలోని దావణగెరెలో పర్యటిస్తున్న యడియూరప్ప బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టుకుని వచ్చే శాసన సభ ఎన్నికల్లో మనం గెలవలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అప్ప దెబ్బతో దూమరం

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి బీఎస్. యడియూరప్పను బలవంతంగా కిందకు దింపిన తరువాత ఆయన మొదటిసారి దావణగెరెలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలు బీజేపీ నాయకుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టుకుని వచ్చే శాసన సభ ఎన్నికల్లో మనం గెలవలేము, లోకల్ లీడర్స్ ను రంగంలోకి దింపిన తరువాత వారి అండతోనే మనం అధికారంలోకి వస్తామని యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు దూమరం రేపాయి. యడియూరప్ప వ్యాఖ్యలతో ఒక్కసారిగా బీజేపీ నాయకులు ఉలిక్కిపడ్డారు.

కేంద్రం పెద్దలు సీరియస్ ?

ప్రధాని నరేంద్ర మోదీ మీద కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కర్ణాటక మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప మీద కర్ణాటక బీజేపీ నాయకులతో పాటు జాతీయస్థాయి బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. కేంద్రంలోని కొందరు బీజేపీ నాయకులు యడియూరప్ప వ్యాఖ్యలపై మండిపడుతున్నారని సమాచారం.

లోకల్ సత్తా కావాలి ఫ్రెండ్స్

ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టుకుని వచ్చే శాసన సభ ఎన్నికల్లో మనం గెలవలేము, కర్ణాటకలో మనం చేసిన అభివృద్ది గురించి ప్రజలకు వివరించాలని, స్థానిక బూత్ స్థాయి నాయకులు, ఫోటోలు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయ్యాలని, అలా చేస్తేనే కర్ణాటకలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు దూమరం రేపాయి. మాజీ సీఎం యడియూరప్ప చేసిన వ్యాఖ్యలకు ఆయన వర్గీయులు మద్దతు ఇవ్వడం, కొందరు బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

కొడుకు ఏం చెప్పాడంటే ?

మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప చేసిన వ్యాఖ్యలతో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సమయంలో ఆయన కుమారుడు, బీజేపీ నాయకుడు బీవై. విజయేంద్ర స్పందించారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి తన తండ్రి బీఎస్. యడియూరప్ప ఎంత కష్టపడ్డారు అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదని అన్నారు.

డాడీకి అన్ని తెలుసుని చెప్పిన కొడుకు

తన తండ్రి ఆన్ని ఆలోచించుకుని మాట్లాడుతారని, ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని బీవై. విజయేంద్ర అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని తన తండ్రి యడియూరప్ప ఎక్కడా కించపరచలేదని, అలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదని బీవై, విజయేంద్ర ఆయన తండ్రి చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు.

 

Leave A Reply

Your email address will not be published.