పదవిని కొనుక్కున్న నువ్వు కూడా సీఎంను దూషిస్తావా?: రేవంత్‌పై మల్లారెడ్డి ఫైర్

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డిపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ 3వ డివిజన్‌లో నిన్న టీఆర్ఎస్ కార్యాలయాన్ని మేయర్ మేకల కావ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పీసీసీ పదవిని కొనుక్కున్న రేవంత్‌రెడ్డి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దూషిస్తున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రాన్ని అభివృద్ధిబాటలో నడిపిస్తున్న కేసీఆర్‌పై రేవంత్ నోరుపారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన రేవంత్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఇంకోసారి కేసీఆర్‌ను కానీ, కేటీఆర్‌ను కానీ తిడితే చూస్తూ ఊరుకోబోమని, వదిలిపెట్టబోమన్న మంత్రి ‘ఖబడ్దార్ రేవంత్’ అని హెచ్చరించారు. కాగా పార్టీ కార్యాలయం ఆవిష్కరణ సందర్భంగా పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆరఎస్‌లో చేరారు.
Tags: Ch Malla Reddy, Revanth Reddy, TRS, Congress

Leave A Reply

Your email address will not be published.