త్వరలో జగన్ సర్కారీ మటన్ మార్ట్లు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో మటన్ మార్ట్ లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రజలకు కల్తీలేని మాంసం విక్రయించేందుకు మటన్ మార్ట్ మొబైల్ వాహనాలను 11.20 కోట్లతో ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఒక్కో మొబైల్ యూనిట్ ధర రూ.10 లక్షలు ఉంటుందని , 112 మంది లబ్దిదారులకు మొదటి దశలో ఎంపిక చేస్తారని చెబుతున్నారు . ఈ వాహనంలో మేకలు , గొర్రెలను కోసేందుకు యంత్రాన్ని  ,ముక్కలుగా కట్ చేసేందుకు పరికరాలు ఉంటాయి అని చెబుతున్నారు.

సినిమా టిక్కెట్  తరహాలోనే…

ప్రస్తుతం సినిమా టిక్కెట్లను ప్రభుత్వం ఆన్ లైన్ లో విక్రయించి నెల కోసారి పంపిణీదారులకు లేదా నిర్మాతలకు వారి వాటా చెల్లించాలన్న ప్రతిపాదన వుంది. అధికారులతో కూడిన కమిటీని నియమించారు. ఇది పూర్తి స్ధాయిలో రూపకల్పన జరుగలేదు. టాలీవుడ్ పరిశ్రమ నుంచి ఎటువంటి ప్రతి స్పందనా రాలేదు.  జగన్ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేదా సమర్ధిస్తూ పరిశ్రమ పెద్దలు స్పందించిన దాఖలాలైతే లేవు.

ఈలోగా మటన్ మార్ట్ లను ప్రారంభించాలని ఆలోచన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడికావాల్సి వుంది.

Leave A Reply

Your email address will not be published.