అందరికీ నచ్చే ‘లవ్ స్టోరీ’ ఎలా వుంటుందో…!

నాగ చైతన్య తో కలిసి సాయి పల్లవి నటిస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల తీస్తున్న ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. సారంగదరియా పాట సూపర్ హిట్ అయ్యింది.

మొదటి నుండి కూడా క్లాస్ చిత్రాలతో తనదైన డైరెక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకుల హృదయాల్లో మంచి పేరు దక్కించుకున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాని కూడా తన గత సినిమాల మాదిరిగానే ఎంతో అద్భుతంగా తీసినట్లు ఇన్నర్ వర్గాల టాక్.

యువ సంగీత దర్శకుడు పవన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే శ్రోతలను విశేషంగా ఆకట్టుకోగా ఇందులోని లేడీ ఓరియెంటెడ్ సాంగ్ అయిన సారంగ దరియా యూట్యూబ్ లో ఏకంగా 300 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం విశేషం. మూడు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ కి అందరి నుండి మంచి స్పందన లభించడంతో పాటు అది మూవీపై వారిలో ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచింది అనే చెప్పాలి. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నేడు సెన్సార్ సభ్యుల నుండి యు / ఏ సర్టిఫికెట్ అందుకోగా సెన్సార్ వారు మూవీ పై మంచి స్పందన వ్యక్తం చేసినట్లు టాక్. కాగా ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ టాక్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఎంతో వైరల్ అవుతోంది.

ఆ టాక్ ని బట్టి సినిమా ఫస్ట్ హాఫ్ ఒకింత మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు అక్కడక్కడా రొమాంటిక్ సీన్స్ తో సాగుతుందని, అయితే ఇంటర్వెల్ లో వచ్చే ఒక ట్విస్ట్ తో సినిమా సెకండ్ హాఫ్ పై ఆడియన్స్ లో బాగా ఆసక్తి పెరుగుతుందట. ఇక కొంత మెల్లగా ఆరంభం అయినప్పటికీ కూడా మెల్లగా పుంజుకునే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్, లవ్ సీన్స్ ఆడియన్స్ మనసుని తాకుతాయని, అలానే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అయితే మరింత ఆకట్టుకునేలా తెరకెక్కినట్లు సమాచారం. మొత్తంగా దీనిని బట్టి త్వరలో ప్రేక్షకుల ముందుకు ఎన్నో అంచనాలతో రానున్న ఈ ‘లవ్ స్టోరీ’ మూవీ పెద్ద విజయం సాధించే  అవకాశం చాలావరకు కనపడుతోందని  టాలీవుడ్ వర్గాలు అంచనా  వేస్తున్నాయి.

 

Leave A Reply

Your email address will not be published.