అత్యధిక యూజర్ల సంఖ్య ఉన్న’ ఫోన్ పే’

 

దేశంలో ఏవస్తువు కొనాలన్నా మనం ఇప్పుడు యుపిఐ యాప్ లపైనే ఆధారపడుతున్నాం. యూనిఫైడ్ ఇంటర్ ఫేస్(యుపిఐ) పేమెంట్ వ్యవస్ధను ఆర్బిఐ అందుబాటులోకి తెచ్చిన తర్వాతే దేశంలో చిల్లర వ్యాపారం పెరిగింది. పది రూపాయలు మొదలుకుని వేలాది రూపాయలు వరకూ ఈ పేమెంట్ యాప్ ల ద్వారా జరుగుతోంది. మనం మొబైల్ లో వాడుతున్న ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే, పే టిఎమ్, ఇలా ఎన్నో రకాల మనీ ట్రాన్స్ఫర్ యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. పక్కకు వెళ్లి ఒక చిన్న టీ తాగినా ఫోన్ పే చేసేస్తున్నాము. చిల్లర గొడవ లేకుండా అంత హ్యాపీ గా ఈ సేవలను అనుభవిస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం వినియోగంలో ఇన్ని యాప్ లు ఉన్నా కూడా “ఫోన్ పే” యాప్ నే అధికంగా వాడుతున్నట్లు “ఫోన్ పే” యాజమాన్యం తెలిపింది. ఇన్ని పేమెంట్ యాప్ లు అందుబాటులో ఉన్నా  వినియోగదారులు ఎక్కువగా ‘ఫోన్ పే’ ను వాడుతున్నారంటే, సర్వీస్, రక్షణ ఇవన్నీ బాగా నచ్చి ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న కస్టమర్ల మదిలో ఉంది. మన ఇండియాలో అత్యధికంగా ఫోన్ పే వినియోగదారుల సంఖ్య   ఉన్న రాష్ట్రం ఏదో అని తెలుసుకోవడానికి చాలా ఆతృతతో ఉన్నారు.

ఇటీవల ఫోన్ పే తెలిపిన సమాచారం ప్రకారం ‘ఫోన్ పే’ ను వాడుతున్న కస్టమర్ల సంఖ్య కర్ణాటకలో ఎక్కువ అని అధికారికంగా తెలిపారు. తరువాత స్థానాలలో వరుసగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. మహమ్మారి కరోనా వైరస్ వచ్చిన తర్వాత “ఫోన్ పే” కస్టమర్ ల సంఖ్య 100 శాతం , ట్రాన్సాక్షన్ ల సంఖ్య 150 శాతం పెరిగినట్లు చెబుతున్నారు.  అందరూ ఈ యాప్ నే విరివిగా వాడుతున్నారు. దీని వలన ఇప్పుడు చాలా సులభంగా ఇంటి అద్దె, కరెంట్ బిల్, డిష్ బిల్, ఇంటర్ నెట్ బిల్ పలు వాటిని కడుతున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదు.

Leave A Reply

Your email address will not be published.