టీటీడిలో ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోలపై సస్పెన్షన్

ఫ్లాష్.. ఫ్లాష్….

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలను నిలుపుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బుధవారం నాడు ఈ విషయంలో దాఖలైన పిటీషన్ లను విచారణకు స్వీకరించిన హైకోర్టు నాలుగువారాల పాటు ఈ జీవో అమలును నిలిపివేసింది. టిటిడి బోర్డులో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం గత వారం జీవోలను జారీ చేసింది. ఈ నియామకం జాబితాను సవాల్ చేస్తూ పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.