గుజరాత్ కొత్త సిఎం భూపేంద్ర పటేల్

గుజరాత్ సీఎం గా భూపేంద్ర పటేల్ ఎంపిక అయ్యారు. ఆదివారం సమావేశమైన బిజెపి శాసనసభాపక్షం కొత్త సిఎంను ఎన్నుకుంది. ఇప్పటి వరకూ సిఎంగా ఉన్న విజయ్ రూపాని నిన్న రాజీనామా చేశారు.

శాసనసభా పక్ష సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా విచ్చేసిన తోమర్‌, ప్రహ్లాద్‌ జోషి సమక్షంలో సీఎం ఎంపిక జరిగింది. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని భూపేంద్ర పటేల్‌ కోరనున్నారు. ప్రస్తుతం ఆయన ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు సీఎంగా ఉన్న విజయ్‌ రూపానీ నిన్న గవర్నర్‌కు రాజీనామా లేఖ అందజేసిన విషయం తెలిసిందే. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాజపాను విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి మార్పును చేపట్టింది. సీఎం పీఠాన్ని పటేళ్ల సామాజిక వర్గానికి ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించడంతో అనూహ్యంగా భూపేంద్ర పటేల్‌ పేరు తెరపైకి వచ్చింది.

Leave A Reply

Your email address will not be published.