ఈడీ కేసులో జగన్ పిటిషన్ పై విచారణ 13కు వాయిదా

ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది.తన తరఫున న్యాయవాది హాజరు అవుతారని , తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వై.ఎస్.జగన్ దాఖలు చేసిన పిటీషన్ విచారణను ఈనెల13కు వాయిదా వేసింది.

పెన్నా ఛార్జ్ షీట్‌లో జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు మరోసారి సీబీఐ గడువు కోరింది. పెన్నా సిమెంట్స్‌పై కౌంటరుకు చివరి అవకాశం ఇస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. జగన్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐకి ఇదే చివరి అవకాశమని తెలిపింది. పెన్నా కేసులో విజయసాయిరెడ్డి, సబిత, శామ్యూల్, రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.

మరోవైపు అరబిందో, హెటిరో కేసుల వాదనలు వినిపించేందుకు కోర్టును ఈడీ గడువు కోరింది. నిందితులు కూడా వాదనలకు సిద్ధం కావాలని కోర్టు స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.