డ్రగ్స్ కేసులో 12 మంది సెలబ్రిటీలకు క్లీన్ చిట్

డ్రగ్స్ కేసులో ఆరోపణలు , విచారణ ఎదుర్కొంటున్న 12మంది సెలబ్రెటీలకు క్లీన్ చిట్ ఇచ్చింది ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ.

 

ఇక అందిన నివేదిక ఆధారంగా సినీ ప్రముఖులెవరు కూడా డ్రగ్స్ తీసుకోలేదని తేల్చేసింది ఎక్సైజ్ శాఖ. వారెవరు డ్రగ్స్ తీసుకోలేదని కోర్టుకి దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో తెలిపింది ఎక్సైజ్ శాఖ. 12మంది సెలబ్రెటీలకు క్లీన్ చిట్ రావటంతో గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ ప్రముఖలని టెన్షన్ పెట్టిన ఈ డ్రగ్స్ కేసు కథ కంచికి చేరింది.

ఏ సినీ ప్రముఖుని నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్​ఎస్​ఎల్​ నివేదికలో పొందుపరచటంతో డ్రగ్స్ కేసుకి ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. 2017లో నమూనాలు తీసుకోగా 5సంల తరువాత రిజల్ట్ రావటం జరిగింది. కేసుకి సంబంధించి ఈ జనవరిలో కోర్టుకి ఎక్సైజ్ శాఖ చార్జిషీట్ దాఖలు చేయగా.. కోర్టు ఈ చార్జి షీట్ ని పరిగణంలోకి తీసుకుంది. ఇక సినీ ప్రముఖులంతా స్వచ్చందంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. గతేడాది డిసెంబరు 8న ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు ఎఫ్ఎస్ఎల్ నివేదికలు సమర్పించింది. కెల్విన్‌పై ఛార్జ్ షీట్ తో పాటు ఈ వివరాలను ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ తాజాగా కోర్టుకు సమర్పించింది.

Leave A Reply

Your email address will not be published.