సిబిఐ కోర్టుకు సాక్షి మీడియా ప్రతినిధులు

హైదరాబాద్: సాక్షి మీడియాపై కోర్టు ధిక్కరణ పిటిషన్‎ను గురువారం నాంపల్లి సీబీఐ కోర్టు విచారించి సోమవారం లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై తీర్పు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండగా బెయిలు పిటీషన్ను కొట్టివేసినట్లు సాక్షి మీడియా సామాజిక మాధ్యమంలో ట్విట్టర్లో పోస్ట్ చేసి కొంత సేపటి తర్వాత తొలగించింది. దీనిని కోర్టు దృష్టికి పిటీషనర్ రఘురామ రాజు తీసుకురాగా సాక్షి ఎడిటర్ , సిఇవో లకు కోర్టు సమన్లు జారీ చేసింది. బెయిల్ పిటీషన్ కోర్టులో విచారణ లో ఉండగానే పిటిషన్‌ను కొట్టి వేశారని ‘సాక్షి’ మీడియాలో కథనాన్ని ప్రచారం చేశారు. దీంతో కోర్టు ధిక్కరణ కింద వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ వేశారు.  పిటీషన్ ఇవాళ విచారణకు రాగా ఎడిటర్ మురళి, సీఈఓ వినయ్ మహేశ్వరి హాజరయ్యారు. కౌంటర్ దాఖలకు మరో రెండు వారాలు గడువు కావాలని సాక్షి మీడియా కోరింది. సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.