మేమొకలా ఉండి , వాళ్ళని వేరేలా ఉండమంటే ఎలా? : కెవిపి

“మేమొకలా ఉండి వాళ్ళని మరోలా వుండమంటే?”: బాంబ్‌ !

ఆగష్టు 5: బి.వి. రాయుడు గారి పుస్తక ఆవిష్కరణ రాజకీయ నాయకుల మనస్సాక్షిమీద బాంబ్ లాంటి ప్రశ్నకు దారి తీసింది.

శ్రీ గోవిందరాజు చక్రధర్‌ ‘రాస్తూనే ఉందాం’ పుస్తకాన్ని యువ పాత్రికేయులకు కరదీపికగా పరిచయం చేశారు.

శాంతా బయోటెక్నిక్స్ ఛైర్మన్ డాక్టర్ వరప్రసాద రెడ్డి:
నేను ఇండియాలోతొలిసారిగా వాక్సిన్ తయారుచేసే అవస్థల్లో ఉన్నప్పుడు నాకు నైతిక మద్దతు ఇస్తూ ధైర్యంగా రాశారు రాయుడు ఉదయంలో. చదివించేలా రాస్తారు…. ఇప్పుడు ఈ పుస్తకంలో తెలుగు నుడికారాలు, జాతీయాలు బాగా పడ్డాయి. అయితే ఈయన మహా టక్కరి. కొన్ని విషయాలు సూటిగా రాయరు. ఏమైనా ఇప్పటికీ అజెండా లేని మంచి జర్నలిస్టు. … అయితే నేను చెప్పాను – ఛానల్లో మాట్లాడొద్దు స్వామీ, రాస్తూ ఉండండి చాలు.

పద్మనాభయ్య, IAS (Retd):
కుల, ప్రాంత పక్షపాతాలు లేకుండా ఉన్నదున్నట్టుగా రాశారు. ఏకబిగిన చదివించేలా రాశారు… ధైర్యం, స్థైర్యంతో రాశారు. చదవదగిన పుస్తకం… జర్నలిస్ట్ గా ఎదగాలంటే డబ్బో, గౌరవమో – ఏదో ఒకటో ఎంచుకోవాలని రాశారు. ఏం ఎంచుకున్నారో మీకు తెలుసు.

ఆంధ్రప్రదేశ్‌ పూర్వ డిప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్‍:
రాయుడు నాకు బంధువు. అతని కలం తన మన భేదం లేకుండా ఎవరిమీదైనా నిర్భయంగా, నిష్పక్షపాతంగా విరుచుకు పడుతుంది. అందుకే నేను ఎవరికీ మా బంధుత్వం గురించి చెప్పేవాడిని కాదు…

IJU అధ్యక్షులు శ్రీ శ్రీనివాసరెడ్డి:
రాయుడు మంచి రాయసగాడు. తెలివైనవాడు. సంచలన కథనాలు రాశాడు. నోరు అదుపుచేసుకునుంటే ఇంకా ఎదిగి ఉండేవాడు.

Dr. KVP రామచంద్రరావు, Ex MP:
రాయుడు ముక్కుకి సూటిగా మాట్లాడే మనిషి, ఒక నిబద్ధత గల మనిషి. అందుకే నేను ఆయనకి తన శక్తికి తగిన అవకాశాలు కల్పించాలని యత్నించి కూడా విఫలమయ్యాను…. సమాజంలోనిష్పక్షపాత జర్నలిజానికి తగిన వాతావరణం కల్పించవలసిన బాధ్యత రాజకీయ నాయకులది, మీడియాది. ఇందుకు తగినట్లుగా మేం (politicians) ఉండలేనప్పుడు, వాళ్ళు (media) మాత్రమే ఉండాలని ఎలా ఆశిస్తాం? ఎలా ఆశిస్తాం?

IPS అధికారి శ్రీ A.B. వెంకటేశ్వరరావు, ఆడిటర్‌ శ్రీ హనుమంతరావు కూడా ఈ పుస్తకాన్ని ప్రశంసించారు. ‘లాయర్‌’ సంపాదకులు శ్రీ ప్రభు కార్యక్రమాన్ని నడిపించారు.

Leave A Reply

Your email address will not be published.