బస్సు బోల్తా :20మందికి గాయాలు

 

బస్సు డ్రైవర్  నిర్లక్ష్యం ఓవర్ స్పీడ్ కారణంగా వివిధ ప్రాంతాల్లో అనేక రకమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి తాజాగా… ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామ సమీపంలో సాయి కృష్ణ ట్రావెల్ బస్సు బోల్తా పడింది.

లారీని తప్పించబోయిన బస్సు బోల్తాపడింది. ప్రైవేటు సాయికృష్ణా ట్రావెల్ కు చెందినది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సు లో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా.. 20 మందికి గాయాలు తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్న, చిన్న గాయాలతో బయటపడ్డారు ప్రయాణికులు. దీంతో 108 వాహనాల్లో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించింది వైద్య సిబ్బంది. ఇక ఈ ఘటన విజయవాడ నుండి శ్రీకాకుళం వెళ్తుండగా చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు..ఈ ఘటన లో బస్సు డ్రైవర్‌ తప్పిదం ఉన్నట్లు సమాచారం అందుతున్న సమాచారం.

Leave A Reply

Your email address will not be published.