చరణ్ ఫైట్ కోసం 10 కోట్ల బడ్జెట్ వేసిన శంకర్!

Big action episode in shankar and Charan movie

శంకర్ .. చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కోసం 200 కోట్ల రూపాయలను కేటాయించినట్టుగా తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా సాగే ఈ కథను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగిగా చరణ్ కనిపించే ఈ సినిమాలో రన్నింగ్ ట్రైన్ లో సాగే ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉందట. చరణ్ .. వందమంది ఫైటర్లు ఈ యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్ కోసం 10 కోట్లు కేటాయించినట్టుగా చెప్పుకుంటున్నారు. అంటే ఏ రేంజ్ లో చిత్రీకరించనున్నారనేది అర్థం చేసుకోవచ్చును.

సహజంగానే శంకర్ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన గత చిత్రాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ సినిమాలో మరింత కొత్తగా యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేయించినట్టుగా చెబుతున్నారు. కియారా అద్వాని కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. .
Tags: Charan, Kiara Advani, Srikanth, Sunil, Anjali

Leave A Reply

Your email address will not be published.