భారత్ బంద్ లో ఎందుకు పాల్గొనాలంటే..!

*బంద్ లో పాల్గొనడం భారతీయుడిగా నా బాధ్యత ఏందుకంటే*

1. చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి నేను కష్టపడి సంపాదించుకున్న నోట్లు చెల్లవని రాత్రికి రాత్రే ప్రకటించినా, పోనిలే దేశ అభివృద్ధికే అని లైన్ నిల్చోని మార్చుకున్నాను. *నేను ఆశించిన మార్పు కనిపించలేదు*

2. *పన్నులు ఎగ్గోట్టే దానికి అవకాశం లేకుండ అందరినీ పన్ను పరిధిలోకి తీసుకువస్తాను అని GST తీసుకొస్తే నా బిజినెస్ దెబ్బ తిన్నా సమర్థించాను. నా బిజినెస్ పెరగలేదు. దేశ ఆదాయం పెరగలేదు*

3. ఈ దేశ పౌరులను, నీవు ఈ దేశ పౌరుడవే అని నిరూపించుకోవాలి. 1974 నాటి ఆధారాలు చూపమని CAA, NRC, NRP తీసుకువస్తే, అస్సాంలో లక్షల మంది నిరూపించుకోలేక పోయారనే వాస్తవాలు నా ముందు ఉన్న అదేదో ముస్లింల గోల అని వదిలేసా…

4. *రైల్వే నుండి LIC వరకు అమ్మేస్తున్నా, కేంద్రంలో ఉద్యోగాలు ఇవ్వకపోయిన, నా ఆస్తులు కాదులే, నా పిల్లలు ప్రైవేటు ఉద్యోగులు వస్తాయిలే అనుకొని బాధపడుతూ వదిలేసా*

5. విమానాశ్రమాల్లో ఆపగలిగే కరోనాను దేశం మీదకు వదిలేసి, నమస్తే ట్రంపు మీటింగ్ పెట్టి సడెన్ గా లాక్ డౌన్ పెట్టి నిర్భంధించిన కనీసం తిండి గింజలు ఇవ్వకపోయిన పస్తులతో గడిపిన నా ఆరోగ్యం కోసమే అనుకున్నా

6. *కార్మిక చట్టాలు జీతం, సెలవులు, పని గంటలు 12గంటలకు పెంచి హక్కులన్నీ తీసేసిన నాలుగు కోడ్లుగా మార్చేసి కార్మికుని కట్టుబానిసగా కంపెనీకి కట్టబెట్టినా నేను కార్మికుని కానని వదిలేసా*

7. కానీ ఈ రోజు వ్యవసాయ చట్టాలు రాష్ట్ర పరిధిలోనివి. దానిని తుంగలో తొక్కి ఎకపక్షంగా మోదీ ప్రభుత్వం చట్టం చేసింది. ఇందులో రెండు చట్టాలు రైతాంగాన్ని నాశనం చేసి కార్పోరేట్ గుత్తాధిపత్యం తెచ్చిరుద్దితే మూడవ చట్టం నిత్యావసర సరుకుల సవరణ చట్టం ఇందులో 23 సరుకులపై ప్రభుత్వ నియంత్రణ ఉండేది. ఇప్పుడు 20 సరుకులను అందులో తీసేసి విలాస సరుకులుగా మార్చేశారు. ఇది అమలైతే పెట్రోలు, డీజిల్ లా ప్రతిరోజూ ఉల్లిపాయలు, నూనె, పప్పులు ఎంత పెరిగాయా అని చూసుకోవాలి. ఇది దుర్మార్గం.

8. *ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో గత పదిహేను రోజుల నుండి 7డిగ్రీల ఉష్ణోగ్రతలో కఠిక చలిలో పోరాడుతుంటే, దేశానికి తిండిపెట్టే రైతన్న ఈ రోజు మన కోసం కూడా పోరాడుతుంటే రోజు నేను వారితో కలవలేనా ! కనీసం ఈ బంద్ లోనైనా పాల్గొనక పోతే నేను భారతీయుడునేనా, అసలు మనిషినేనా?*

9. ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంఘీభావం, క్రీడాకారులు, లాయర్లు, డాక్టర్లు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, మహిళలు పాల్గొంటుంటే నేను అందులో ఒకడినే కదా నేను బంద్ చేసి తీరుతా…

నేను సగటు భారతీయుడిని

Leave A Reply

Your email address will not be published.