బెయిల్ రద్దుపై భిన్నాభిప్రాయాలు:నేడే తీ‌ర్పు

సర్వత్రా ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా? లేక రఘురామ కృష్టరాజు బెయిల్ పిటీషన్ ను సిబిఐ కో‌ర్టు కొట్టివేస్తుందా అన్న విషయం మరో 24 గంటల్లో తేలిపోతుంది. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా మరో వ్యక్తి హైకోర్టు కు అప్పీల్ కి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది.
గతవాయిదా సమయంలో తీర్పు వెలువడక ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి సోషల్ మీడియా విభాగం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆనుకూలంగా సిబిఐ కోర్పు ఇచ్చినట్లు ట్వీట్ చేసింది. ఇది కోర్టులో వాదనలు జరుగుతున్న దశలోనే సోషల్ మీడియాలో తీర్పు వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోందని సిబిఐ కోర్టు దృష్టికి పిటీషనర్ రఘురామ రాజు తీసుకురావడమే కాకుండా కోర్టు ధిక్కారణ పిటీషన్ వేశారు. నిన్న సాక్షి ప్రతినిధుల తరఫున అడ్వొకేట్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించి మానవ తప్పిదమని క్షమించాలని కోరారు. ఇక 15 వతేదీన తీర్పు వెలువడే నేపధ్యంలో ఈ కేసు విచారణ ను వేరే న్యాయ మూర్తి కి బదలాయించాలని కోరుతూ పిటీషనర్ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు.ఇది ఈరోజు విచారణకు వచ్చింది. దీనిపై హైకోర్టు ఏమందంటే….

కొనసాగుతుందా..? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓ వర్గం కచ్చితంగా బెయిల్ రద్దు అవుతుందని.. మరో వర్గం బెయిల్ రద్దయ్యే అవకాశం లేదని వాధిస్తున్నాయి. దీనీపై సీబీఐ కోర్టు రేపు తుది తీర్పు ప్రకించనుంది. అయితే సీఎం జగన్ బెయిల్ ను రద్దు చేయాలి అంటూ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ పై విచారణ ఇప్పటికే పూర్తైంది. ఈ కేసులో ఇరు వర్గాల వాదన పూర్తైంది. దీంతో తుది తీర్పు వెలువడుతుందని అంతా ఆశిస్తున్నారు. దీనిపై రేపు సీబీఐ కోర్టు ఆర్డర్ ఇవ్వనుంది. జగన్ బెయిల్ రద్దు కేసు తీర్పుదశలో ఇప్పటికే అనేకపర్యాయాలు వాయిదా పడుతూ వచ్చింది. జగన్ తో పాటు ఆ పార్టీ మరో ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అనేక కేసులలో సహ నిందితుడిగా ఉండటంతో అతని బెయిల్ కూడా రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డి ల బెయిల్ రద్దు పిటిషన్ లపై నిర్ణయం ఈ నెల 15న వెలువరిస్తామంటూ… కోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇద్దరి బెయిల్ రద్దు పిటిషన్‌లపై తీర్పును ఒకేసారి కామన్ ఆర్డర్‌గా ఇస్తామని సీబీఐ కోర్ట్ స్పష్టం చేసింది.ః

ఈ ఇద్దరి బెయిల్ రద్దు అవుతుందా.. కొనసాగుతుందా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జగన్ బెయిల్ రద్దవుతుందని ప్రతిపక్షాలు ఒకింత గట్టినమ్మకంతో ఉన్నాయి. పిటిషనర్ ఎంపీ రఘురామ రాజు అయితే చాలా నమ్మకంతో జగన్ బెయిన్ రద్దు అవుతుందని పదే పదే చెబుతున్నారు.

బీజేపీ నేతలు, బెయిల్ పిటిషన్ వేసిన ఎంపీ రఘురామ మాత్రం బెయిల్ రద్దవుతుందని చెబుతున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం బెయిల్ రద్దు అయ్యే అవకాశం లేదని వాదిస్తున్నారు. బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు కబట్టే ఇటీవల ఎంపీ విజయసాయి రెడ్డికి విదేశాలకు అనుమతి వచ్చిందని గుర్తు చేస్తున్నారు..

అయితే వైసీపీ వర్గాల్లో ఇప్పుడు మరో ప్రాచారం కూడా ఉంది. బీజేపీ అధిష్టానం.. ముఖ్యంగా అమిత్ షా నుంచి సీఎం జగన్ కు స్పష్టమైన సంకేతాలు ఉన్నట్టు తెలుస్తోంది. బెయిల్ రద్దు అయ్యే అవకాశం లేదని జగన్ కు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

అందుకే సీఎం జగన్ సైతం చాలా ధీమాగా ఉన్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఈ నెల 16న అంటే గురువారం ఏపీ కేబినెట్ భేటీని సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారని. నిజంగా బెయిల్ రద్దవుతుందా..? లేదా అనే అనుమానం ఉంటే.. తీర్పు తరువాతే కేబినెట్ భేటీపై నిర్ణయం తీసుకుంటారు కదా అని లాజిక్ చెబుతున్నారు. మరి చూడాలి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నది..

Leave A Reply

Your email address will not be published.