ఆంధ్రా , ఒడిషా సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తత

ఒడిశా సర్కార్‌పై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు సీజ్‌ చేయడంపై సీరియస్‌ అయింది.

ఒడిశా అరాచకాలపై మౌనంగా ఉండడంపై పోలీసులు, రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సీజ్‌ చేసిన ఒడిశా ఎమ్మార్వోపై కేసు నమోదు చేయాలని పోలీసులను  ప్రభుత్వం ఆదేశించింది. ఈ వివాదం నెలకొన్నప్పటి నుంచి ఆంధ్రా భూభాగంలో ఒడిషా టెర్రర్ సృష్టిస్తోంది. సరిహద్దు గ్రామాల్లో పెత్తనం కోసం దౌర్జన్యం చేస్తోంది. ఏవోబీలో ఆధిపత్యం కోసం అడ్డగోలుగా ప్రవర్తిస్తోంది. ఒడిషా దుందుడుకు చర్యలతో ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు గ్రామాలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఒడిషా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం మాణిక్యపట్నం గ్రామంలో అంగన్ వాడీ కేంద్రాన్ని ఒడిషా పోలీసులు సీజ్ చేశారు. అడ్డుకోబోయిన అంగన్ వాడీ కార్యకర్త భర్త గుర్నాథాన్ని అరెస్ట్ సైతం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, విజయనగరం జిల్లాలో ఇదే తరహా దౌర్జన్యానికి పాల్పడింది ఒడిషా అధికారులు.

ఒడిషా దౌర్జన్యాలపై మాణిక్యపట్నం గ్రామస్తులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. తమ గ్రామస్తుడ్ని అరెస్ట్ చేయడంపై భగ్గుమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఒడిషా నుంచి తమకు శాశ్వత విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు

అసలు, వివాదమేంటి? ఒడిషా ఎందుకు ఆంధ్రా భూభాగంలో పెత్తనం కోసం ప్రయత్నిస్తోంది? ఆంధ్రా-ఒడిషా సరిహద్దు గ్రామాలపై దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. ఆ గ్రామాలు తమవంటే తమవంటున్నాయి ఏపీ, ఒడిషా. అటు ఒడిషా… ఇటు ఏపీ… రెండూ కూడా ఆయా గ్రామాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఏవోబీ గ్రామాల ఇష్యూపై సుప్రీంకోర్టుకు సైతం వెళ్లారు. పార్లమెంట్ పరిశీలనలోకి కూడా వెళ్లింది.

సుప్రీంకోర్టు అండ్ పార్లమెంట్ పరిశీలనలో ఉండగానే ఏవోబీ గ్రామాల్లో ఒడిషా పెత్తనం ప్రయత్నిస్తోంది. సరిహద్దు రాళ్లను మార్చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతోంది. అయితే, 1994 రికార్డ్స్ ప్రకారం అంగన్‌వాడీ కేంద్రం ఉన్న ప్రాంతం తమదేనంటూ ఒడిషా క్లెయిమ్ చేస్తోంది .

అలాగే విజయనగరం జిల్లాలో ఉన్న కొటియా గ్రూప్ గ్రామాల్లో కూడా ఇటీవల ఒడిషా అధికారులు హడావుడి చేశారు. మాణిక్య పట్నం గ్రామాన్ని శ్రీకాకుళం     జిల్లా  మంత్రి అప్పలరాజు సందర్శించారు.

Leave A Reply

Your email address will not be published.