వెలుగులోకి వచ్చిన సిఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్

అమరావతి: ఏపీలో భారీ స్కామ్‌ బయటపడింది. సీఎంఆర్ఎఫ్ నిధుల గోల్‌మాల్‌ గుట్టును ఏసీబీ రట్టు చేసింది. పేదల డాటా సేకరించి, సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టించినట్లు ఏసీబీ విచారణలో తేలింది.

ఈ భారీ స్కామ్‌లో 50 మంది ప్రమేయం ఉన్నట్టు సమాచారం. ప్రజాప్రతినిధుల పీఏలు, అనుచరుల పాత్రపై ఏసీబీ ఆరా తీస్తోంది. కేసులో పలువురు నిందితులను ఇప్పటికే ఏసీబీ అరెస్ట్ చేసింది.
2014 నుంచి సీఎం రిలీఫ్ ఫండ్‌లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో ఏసీబీ గుర్తించింది. తప్పుడు పేర్లు, తప్పుడు పత్రాలతో నిధులు నొక్కేసినట్టుతేల్చారు. దీనికి సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో ఏసిబి వద్ద ఈ కేసు నమోదైంది.  సీఎంఆర్ఎఫ్‌లో సబ్ ఆర్డినేట్లు పనిచేస్తున్న చదలవాడ సుబ్రహ్మణ్యం, సోకా రమేష్, ప్రజాప్రతినిధి దగ్గర ప్రయివేటు పీఏ ధనరాజు అలియాస్ నాని, ఒంగోలుకి చెందిన మురళీకృష్ణలను అరెస్ట్ చేశారు.

సీఎంఆర్ఎఫ్‌లో అక్రమాలు జరిగినట్లు అధికారుల ఫిర్యాదుతో ఏసీబీ విచారణ చేపట్టింది. నలుగురు నిందితులని ఏసీబీ అరెస్ట్ చేసింది. సీఎంఆర్ఎఫ్‌లో సబార్డినేట్లగా పని చేస్తున్న చదలవాడ సుబ్రమణ్యం, సోకా రమేష్, ప్రజాప్రతినిధి దగ్గర ప్రైవేట్ పీఏ ధనరాజు అలియాస్ నాని, ఒంగోలుకి చెందిన మురళీకృష్ణలను అరెస్ట్ చేశారు.

సీఎంఆర్ఎఫ్ లాగిన్ ఐడి, పాస్ వర్డులని సేకరించి ఫోర్జరీ పత్రాలు, తప్పుడు క్లెయిమ్స్‌తో నిధులు దిగమింగినట్లు ఏసీబీ గుర్తించింది. 2014 నుంచి ప్రజాప్రతినిధులకి ప్రైవేట్ పీఏగా పనిచేస్తూ ధనరాజు అలియాస్ నాని అక్రమాలకి పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటివరకు 88 ఫైళ్లలో అక్రమాలని గుర్తించిన ఏసీబీ రూ. కోటి పైనే అక్రమ లావాదేవీలు బ్యాంకు అకౌంట్ల ద్వారా జరిగినట్లు గుర్తించారు. ఏడెనిమిదేళ్లుగా సీఎంఆర్ఎఫ్‌ నిధులు గోల్ మాల్ జరిగినట్లు ఏసీబీ ప్రాధమిక దర్యాప్తులో నిర్ధారించింది.

Leave A Reply

Your email address will not be published.