చిన్నారి పై అత్యాచారం కేసు: నిందితుడి ఆచూకీ చెబితే 10లక్షలు!

హైదరాబాద్‌: సైదాబాద్‌లో ఆరేళ్ల బాలికపై హత్యాచర ఘటనలో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు అతడి ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయలు రివార్డును హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. దీనిపై సంచలన నిర్ణయం తీసుకున్నారు.

నిందితుడ్ని పట్టించిన వారికి రూ.10లక్షలు రివార్డు ఇస్తామని ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు 94906 16366 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌ పోలీసులు ఇంత మొత్తంలో రివార్డు ప్రకటించిన దాఖలాలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి నాలుగు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్నాయి. అయినా, నిందితుడు రాజు ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు చూపుతూ పోలీసులు రివార్డు ప్రకటించారు. నిందితుడి రెండు చేతులపై మౌనిక అని టాటూ ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.