ఎవరికి దోచిపెట్టడానికి ఈ జీవో? నిలదీసిన బిజెపి

ఎవరికి దోచిపెట్టడానికి జీఒ 217 విడుదల చేశారు?

వైకాపా సంబంధిత కాంట్రాక్టర్లకు మత్స్యసంపద దోచిపెట్టడానికే జోఓ 217ను ప్రభుత్వం విడుదల చేసిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కాయరోబోర్డు జాతీయ డైరెక్టర్ సి. చంద్రమౌళి మాట్లాడుతూ మత్స్యకారులకు సహజసిద్ధంగా ఆదాయవనరుగా లభిస్తున్న చెరువులు, అందులోని మత్స్యసంపదను రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతో తమ పార్టీ నాయకులు, తాబేదార్లకు కట్టబెట్టేందుకు జీఓ నెంబరు 217 జారీచేసిందని ఆరోపించారు. మంత్రి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ మత్య్సకారవర్గానికి చెందినవారైనప్పటికీ ఆ వర్గానికే ద్రోహం చేయతలపెట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ఇచ్చిన జీవనభృతి నిధులు, వలలు, బోట్లు. ఆర్ధిక సహాయం కూడా దారిమళ్లించి అనర్హులకు కట్టబెడుతున్నట్లు విమర్శించారు. మత్స్యకారుల ఆదాయవనరులను గండికొట్టే జీఒ 217 వెంటనే రద్దుచేయాలనిలేకుంటే భాజపా – జనసేన కలసి రాష్ట్రంలో తీవ్ర ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన ఇలా ఇలా3 అన్నారు……..

70 ఏళ్ల స్వతంత్ర భారతంలో బలహీనవర్గాలకు చెందిన మత్స్యకారులు చేసిన అనేక ప్రయత్నాల తర్వాత 2014లో శ్రీ నరేంద్రమోడీ ఆధ్వర్యంలో మొట్టమొదట సరిగా కేంద్రంలో మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. ఏర్పాటు చేయడమే కాకుండా దానికి సంబంధించి నిధులు కేటాయించారు. లక్షలాది మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు వారికి ఆర్థిక సాధికారత కల్పించేందుకు అనేక కార్యక్రమాలు ప్రధాని మతక్యృ యోజన పేరిట అమలు చేస్తున్నారు. వియత్నాం, శ్రీలంక, చైనా వంటి దేశాలు మత్స్యసంపదలో సాధిస్తున్న ప్రగతి, వారు పాటిస్తున్న సరికొత్త సాంకేతిక ప్రక్రియలను కూడా మనదేశంలో అమలు చేయాలనే ఉ దేశంతో ఈ మంత్రిత్వశాఖ పనిచేస్తోంది. కరోనా ఉన్న సమయంలోనే రూ.20 వేల కోట్లు ఈ శాఖకు కేటాయించారు. ఈ శాఖద్వారా మత్స్యకారుల అభివృద్ధికి వలలు, బోట్లకు కొనుగోలు సబ్సిడీ, కోల్డ్ స్టోరేజ్‌ల ఏర్పాటు, మార్కెటింగ్ సదుపాయం, సాంకేతిక నైపుణ్యాలు వంటి విప్లవాత్మక కార్యక్రమాలు చేస్తున్నారు. 974 కి. మీ. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఎపీలోను ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.సంస్థలకు చెందిన 100 ఎకరాలకు పైన ఉన్న చెరువుకు వర్తిస్తుందని ఈ జీఓలో ఉంది. దీనికి అనుబంధంగా వున్న పేపరులో నెల్లూరు జిల్లాకు జిల్లా సంబంధించి 27 చెరువులు మాత్రం అమలు చేస్తున్నట్లు ఉంది.

ఈ జోఓ ద్వారా 70 లక్షల మత్స్యకారులకు సందేశం ఇవ్వదలచుకున్నారు. వారిని ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో జవాబు చెప్పాలి. 217 కేవలం నెల్లూరు కే పరిమితం చేసే పక్షంలో జీవోలో ఈ విషయాన్ని ఎందుకు చేర్చలేదు. జీఓ సంబంధించిన విధివిధానాల్లో నెల్లూరు జిల్లాను ప్రయోగాత్మకంగా తీసుకున్నట్లు చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కార్యక్రమాన్ని అమలు చేస్తారని ఈ జోఓ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. దీనికి మీరు సమాధానం చెప్పాలి.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీసోము వీర్రాజు గారు మత్స్యకారుల గురించి ఆలోచించడం ఎనిమిదో ప్రపంచవింతగా పేర్కొన్న మంత్రి అప్పలరాజు రాజకీయ అజ్ఞాని. భాజపా నాయకులు, వారి సేవలు, సమస్యలపై పోరాటాల సంగతి తెలిసేంత రాజకీయ చరిత్ర మీకు లేదు. ప్రధాని శ్రీ సరేంద్రమోడీ ఆధ్వర్యంలో అమలుజరుగుతోన్న అనేక మైన అద్భుతమైన కార్యక్రమాలపై మీకు అవగాహన ఉందా? రాష్ట్రంలో సాధ్వీ నిరంజన్ జ్యోతి ఆధ్వర్యంలో ప్రభుత్వ వ్యతిరేక విధనాలపై చేసిన పోరాటాలు మీకు గుర్తులేదా? తెదేపా ప్రభుత్వంపై గత ఐదేళ్లుగా మేము చేసిన పోరాటాలు మీకు తెలియదా? శ్రీకాకుళం, కాకినాడ, కర్నూల్లో చేసిన పోరాటాలు మర్చిపోయారా? మీ మిత్రుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను అడిగితే ఆయనే చెబుతారు.

కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్రానికి ఇస్తున్న వందల కోట్ల నిధుల గురించి మీకు తెలీదా? మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ పాత్రపై మోపిదేవి వెంకటరమణ మీడియా ముందు ఎందుకు చెప్పలేదు? మత్స్యభరోసా పథకంలో 1.20 లక్షల మందికి రూ. పదివేలు ఇచ్చామన్నారు. ఇందులో అసలైన లబ్దిదారులెందరో, మీ పార్టీ తాబేదారులెందరో స్పష్టం చేయాలి. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని భాజపా ప్రశ్నిస్తోంది. మీ నియోజకవర్గం నిజాంపట్నంలో నకిలీ లబ్దిదారులను మత్స్యశాఖ పట్టుకున్న విషయం గుర్తుచేస్తున్నా? రాష్ట్రంలో ఇంకా 24 వేల మంది మత్స్యకారులకు భృతి అందలేదు. ఈ విషయం మీచెవికెక్కలేదా? మీకు చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు రావాలి. ఆపదలో ఉన్న వారికి రూ.10 లక్షలు ఇచ్చే బీమాను 64 మందికి ఇచ్చామంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంతమందికి ఇచ్చారో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. దాంతోపాటు ఈ పది లక్షల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వ మాట ఎంతో ప్రజలకు స్పష్టం

చేయాలి. ఈరోజు ప్రతి కార్యక్రమంలో నరేంద్ర మోడీ ప్రత్యక్ష ఆర్థిక సహాయం ఉంది. మీకు తెలియడం లేదా? మత్స్యకారులకు నాలుగు కార్పొరేషన్ ఏర్పాటు చేశామని గర్వంగా చెప్పారు. చాలా సంతోషం. చంద్రబాబు. పాలనకు విసుగెత్తి ఈ రాష్ట్రంలోని బలహీనవర్గాలు, మత్స్యకారులు కలసి వైకాపాకు 151 మంది ఎమ్మెల్యేలు అప్పగిస్తే మీరేం ఈ వర్గాలకు న్యాయం చేయలేదు? మీరు ఏర్పాటుచేసిన నాలుగు కార్పొరేషన్ల ద్వారా ఇప్పటివరకు ఎన్ని కోట్లు నిధులు ఖర్చు పెట్టారో చెప్పగలరా? మీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 53 కార్పొరేషన్లు, ఒక్కోదానికి ఎన్ని కోట్లు నిధులు ఖర్చు పెట్టారో చెప్పగలరా? మీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 53 కార్పొరేషన్లు, ఒక్కోదానికి

నియమించిన తొమ్మిది మంది డైరెక్టర్లను మీ పార్టీ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం బలహీన వర్గాలను అవవానించడం కాదా?

మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కో ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయించి ఖర్చుచేసి మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తే ఈ జాతి మిమ్మల్ని గుర్తు పెట్టుకునేది. కానీ కనీసం కార్పోరేషన్లకు కార్యాలయం, ప్రోటోకాల్ సదుపాయాలు విధివిధానాలు లేకుండా చేయడం సిగ్గుచేటు.

రెండేళ్ల క్రితం కేంద్ర గిరిరాజ్ సింగ్ మీరు, సిఎం జగన్మోహన్ రెడ్డితో పాటు నేను కూడా పాల్గొన్న కార్యక్రమంలో పది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక చర్యలు ప్రారంభించడం జరిగింది. దీనికి పర్యావరణ, అటవీశాఖ అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఈ ప్రాజెక్టులను మేమే చేపడతామని తీసుకుని ఇంత వరకు వాటిని ప్రారంభించలేదు. నాబార్డుకు చెందిన మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధుల నుంచి ఎన్ని వందల కోట్లు వస్తున్నాయి ప్రజలకు తెలియాలి. కాని పది ర్లలో కేవలం నాలుగింటికి మాత్రమే పనులు ప్రారంభిస్తామని మీరు పేర్కొనడం సిగ్గుపడాల్సిన విషయం. మిగతా వాటి పరిస్థితి ఏమిటి? వీటిని పూర్తిచేయడానికి మరో 20 ఏళ్లు కావాలా? దీనిపై మత్య్సజాతికి సమాధానం చెప్పాలి,

కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి అనేక రకాల కార్యక్రమాలు అమలుచేస్తుంది. నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, సీవీడ్, పెరల్, ఆర్నమెంట్ ఫిష్ టెక్నాలజీలు ఇలా అనేకమైన కార్యక్రమాలు కేంద్రం అమలుచేస్తోంది. మీరు మేనిఫెస్టోలో పెట్టిన మెరైన్ వర్శిటీ ప్రకటనకే పరిమితం అయింది. దీనికి మీరు సమాధానం చెప్పాలి. మత్స్యకారుల బృతి అసలైన లబ్దిదారులకు అందడం లేదు. పోర్టులు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఇచ్చే వలలు, బోట్లు, సబ్సిడీలు, 217 జీఓ అమలుచేయడం ద్వారా ఓపెన్ యాక్షన్‌లో వేసిన దళారులు, మీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కట్టబెట్టాలనుకున్నారా?

దళారీ వ్యవస్థ వల్ల మత్య్సకారుల జీవన ప్రమాణాలు పెరగలేదంటున్నారు. మత్స్యకారులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, నాణ్యమైన ఫీడ్, మిగతా విషయాలు లేవని చెప్పడం మీ వైఫల్యం కాదా? మీ చేతగానితనం కప్పిపుచ్చుకోవడానికే రాష్ట్రంలో అన్నీ కాంట్రాక్టులకు ఇచ్చేస్తున్నారు. ఇసుక, మద్యం, సినిమా టికెట్లు ఆఖరికి మాంసం కూడా వదల్లేదు. మీ పార్టీ నాయకులకు ఆదాయం చేకూర్చడానికి చివరికు బడుగు బలహీన వర్గాలకు సహజసిద్ధ ఆదాయమార్గంగా లభించిన చెరువులను కబ్జా చేయడానికి ఈ 217 జీఓ తేవడం వాస్తవం కాదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు, ఆర్ధిక సబ్సిడీలు మీ కార్యకర్తలకు కట్టబెట్టదలచుకున్నారా? వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి.

ప్రతి కో ఆపరేటివ్ సొసైటీకి చెరువులపై హక్కు ఉందా? అనే విషయంపై ఈరోజు మీరు సమాధానం చెప్పాలి. ఏదో ఆర్థిక వెసులుబాటును చూపించి శాశ్వత భుక్తంలో ఉన్న నదులు, చెరువులు వంటి నీటివనరులను కార్పొరేటర్లకు దారాదత్తం చేయడం మీరు ఈ జాతికి చేస్తున్న తీరని ద్రోహం. మత్యకారుల చరిత్రలో మీరు ద్రోహులుగా మిగిలిపోనున్నారు. ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీ ఇలాంటి సాహసం చేయలేదు.నీటివనరులను గంగా, గోదావరిమాతగా ఈ జాతి భావిస్తుంది. మత్ససంపద సహజసిద్ధంగా లభించే హక్కు అలాంటి వనరులపై సహకార సంఘాలకు హక్కు ఉంది. వారి హక్కును కాదని ఇతరులకు అప్పగించేలా ఈ రకంగా మీరు నిర్ణయం తీసుకున్నారు ? ఇప్పటికే జీఓ విడుదలైంది. దాని విధి విధానాలు మాత్రమే మారుస్తామంటున్నారు. కానీ ప్రైవేటుకు అప్పగించాలనే నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారు. మీకు నిజంగా చిత్తశు ద్ధి ఉంటే ముందుగా ఆ జోఓను వెనక్కి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకు అమలుచేసే సంక్షేమ పథకాలు కిందిస్థాయి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. లేకుంటే మత్స్యకారులకు చెందిన అన్ని కులాలు ఒక తాటిపైకి వచ్చి మీ తాట తీస్తారు. జీఓ 217 కేవలం నెల్లూరు వరకే పరిమితం చేస్తున్నామనడం మత్స్యకారులను మోసం చేయడమే. ఈ జీఓను ఉపసంహరించుకోవడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకు అనేక పథకాలను తీసుకెళ్లాలి రాబోయే రోజుల్లో ప్రతిగ్రామంలో మత్స్యకార సంఘాలు, బాధితులను కలుపుకుని భాజపా పెద్ద ఉద్యమం చేయబోతోంది.

భాజపా మత్స్యకార సెల్ కన్వీనర్ బొమ్మిడి గణేష్ మాట్లాడుతూ మత్స్యకారుల జీవనభృతి కోల్పోయేలా చేసే 17ను ఉపసంహరించాలని సిఎంకు లేఖ రాసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుము సోమువీర్రాజును మంత్రి అప్పలరాజు విమర్శించడాన్ని ఖండించారు. వాస్తవాలు కఠోరంగా ఉన్నవి కాబట్టే ఉక్రోషంతో మంత్రి ఆరోపిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో భాజపా జనసేన కలసి జీఒ 217 రద్దుచేయాలని డిమాండ్‌చేస్తూ పోరాటం చేయనున్నట్లు చెప్పారు. వేదికపై కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలువోలు బుచ్చిబాబు ఆశీనులయ్యారు.

Leave A Reply

Your email address will not be published.