ఎంపీ రఘుపై అనర్హత వేటు వేయండి:వైసీపీ

ఢిల్లీ:

రఘురామకృష్ణరాజును డిస్ క్వాలిఫై చేయండిః లోక్ సభ స్పీకర్ కు చీఫ్ విప్ భరత్ ఫిర్యాదు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ కె. రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాకు లోక్ సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు.

రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను తాము లోక్ సభ స్పీకర్ కు సమర్పించామని, అనేక పర్యాయాలు డిస్ క్వాలిఫికేషన్ కు సంబంధించి స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా ఈరోజు మరోసారి లోక్ సభ స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని శ్రీ భరత్ తెలిపారు.
గత ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య కాలంలో ప్రత్యేక విమానంలో అమరావతి నుంచి ఐదుగురు ఎంపిలను ఢిల్లీకి పంపి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరింది. ఇప్పటి వరకూ స్పీకర్ ఎటువంటి చర్యా తుసుకోకపోవడంతో శుక్రవారంనాడు మరో పిటీషన్ ను వైసీపీ ఎంపీ మార్గాని భరత్ స్పీకర్ కు అందజేశారు. రఘు పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, అందువల్ల ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.