ఎన్నికల కమిషన్ కౌన్సిల్ రాజీనామా

భారత ఎన్నికల కమిషన్ తరఫున సుప్రీం కోర్టులో వాదించే న్యాయవాది మోహిత్ రామ్ రాజీనామా చేశారు .ప్రస్తుతం ఎన్నికల కమిషన్ లో విలువలోపాలు ఉన్నాయని పేర్కొంటూ తన పదవికి రాజీనామా చేశారు. లా కమిషన్ కు ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించానని కోర్టుకు తెలిపారు. నిన్ననే సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్ పిటిషన్ను కొట్టివేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పత్రికలలో రాకుండా చూడాలని ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టు ను కోరింది. అయితే కోర్టులో వాదనలు ప్రజలకు తెలియాలని అందుకు పత్రికలు అందుబాటులో ఉన్న సాధనాలు అని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.