చెక్ పవర్ కోసం సర్పంచ్ వివరాలు నమోదు

*చెక్ పవర్ కోసం సర్పంచుల వివరాల నమోదు…*

*• నేటినుంచి ఎంపీడీవో ఆఫీసుల్లో వివరాల సేకరణ…*

*• ఇవి పరిశీలించి ఐడీలు కేటాయించనున్న ట్రెజరీ శాఖ…*

*అమరావతి:* చెక్ పవర్ కోసం రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు గురువారం నుంచి తమ ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లి సీఎఫ్ ఎంఎస్ లాగిన్ తమ వివరాలు నమోదు చేసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధిశాఖ కమిషనర్ గిరిజాశంకర్ కోరారు. చెక్ పవర్ను ఉపయోగించుకోవడానికి వీలుగా సర్పంచులకు సీఎఫ్ఎంఎస్ లాగిన్ ఐడీలు కేటాయించేందుకు అన్లైన్ అప్లికేషన్ ను ఎంపీడీవోల లాగిన్ అందు బాటులో ఉంచినట్టు చెప్పారు. సర్పంచులు ఆన్లైన్ వివరాలు నమోదు చేయడంతో పాటు బయోమెట్రిక్ వివరాలను కూడా ఇవ్వాలన్నారు. ఆ వివరాలను ఎంపీడీవోల ట్రెజరీ శాఖ ‘లు పరిశీలనకు పంపుతారని తెలిపారు. ట్రెజరీ అధికారులు వీటిని పరిశీ లించి ప్రతి సర్పంచికి ఒక ఐడీ నంబరు కేటా యిస్తారని తెలిపారు. అనంతరం సర్పంచు లు చెక్పవర్ను వినియోగించుకునే అవకాశం ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.