సల్మాన్ తో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి: పూజా హెగ్డే

టాలీవుడ్ లో కన్నడ ముద్దుగుమ్మ పూజా హెగ్డే అగ్రనటిగా కొనసాగుతోంది. ఆమె సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. కరోనా ప్రభావం లేకపోతే… ఈ ఏడాది ఈద్ కు సల్మాన్ తో తాను కలిసిన నటించిన ‘కభీ ఈద్ కభీ దీవాలి’ సినిమా రిలీజ్ అయ్యేదని తెలిపారు. కరోనా వల్లే ఈ సినిమా విడుదల కాలేదని చెప్పారు.

సెట్స్ లో ఉన్నప్పుడు సల్మాన్ తో తాను ఎన్నో మాటలు మాట్లాడుకున్నానని… ఆయనతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయని పూజ తెలిపింది. ఆయనతో నటించడం చాలా గొప్ప అనుభవం అని చెప్పింది. సల్మాన్ తో తాను నటించిన చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తారని తెలిపింది.

ఇటీవల పూజా హెగ్డే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే హోమ్ ఐసొలేషన్ లో ఉంటున్న ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోంది. మరోవైపు, పూజ బాలీవుడ్ లో మరో చిత్రాన్ని కూడా చేస్తేంది. రణవీర్ సింగ్ సరసన ‘సర్కస్’ చిత్రంలో ఆమె నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది.

Leave A Reply

Your email address will not be published.