కేసీఆర్ దొరగారు.. ప్రతీకార రాజకీయాల నుంచి కాస్త తీరిక చేసుకోండి: ష‌ర్మిల‌

తెలంగాణలో క‌రోనా విజృంభ‌ణ పెరిగిపోయిన నేప‌థ్యంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్ ష‌ర్మిల విమ‌ర్శలు గుప్పించారు. క‌రోనా వేళ‌ ప్ర‌తీకార రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌బెట్టి ప్ర‌జల ఆరోగ్య ప‌రిస్థితులను ప‌ట్టించుకోవాల‌ని ఆమె సూచించారు.

‘కేసీఆర్ దొరగారు.. ప్రతీకార రాజకీయాల నుంచి కాస్త తీరిక చేసుకొని, ప్రజలను కరోనా నుంచి కాపాడండి. కరోనా కిట్లు అందట్లేదని లక్షల మంది కాల్ సెంటర్లకు కాల్ చేసే వారికి కిట్లను ఇవ్వండి. కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చి మందులను, ట్రీట్మెంట్లను ఉచితంగా అందించండి’ అని ష‌ర్మిల ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.