ఆంధ్రప్రదేశ్ లో నిద్రలేని రాత్రి‌! పరిషత్ ఎన్నికల ప్రహసనం!!

*ఆంధ్రప్రదేశ్ లో నిద్రలేని రాత్రి* 😜🤣

*శివరాత్రి జాగారం కంటే ఎక్కువగా, ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కంటే ఉత్కంఠగా మంగళవారం రాత్రి రాష్ట్ర మంతా నిద్ర లేకుండా(పోకుండా) ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలెక్షన్ కు అంతా సిద్ధమై ప్రచారం ముగింపుకు కొద్ది గంటల ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్ పై స్టే ఇవ్వడం, ఆగమేఘాల మీద ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ బెంచ్ అప్పీల్ కు వెళ్ళడం చకచకా జరిగిపోయాయి.*
ఇదంతా ఒక ఎత్తైతే *’తీర్పు’ అర్ధరాత్రి 2:30 గంటలకు* వస్తున్నదని వార్త రావడంతో ఏమి జరుగుతుందో ఏమో అని రాష్ట్ర ప్రజలు, అధికార, ప్రతిపక్ష నాయకులు, బరిలో ఉన్న అభ్యర్థులు, అధికారులు, ఉద్యోగులు, కార్యకర్తలు నిద్రలేకుండా టీవీ/మొబైల్ లు చూస్తూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని అధికార పార్టీ, మరోవైపు ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచించడం అందరిని అయోమయానికి గురిచేస్తుంది.
ఇప్పటికే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు, పాఠశాలలు, కళాశాలలకు, వివిధ ప్రభుత్వ/ప్రయివేటు కార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో సెలవులు ఇవ్వాలా, వద్దా..? అనుకూలంగా వస్తే సరే లేకపోతే ఏమి చేయాలో పాలుపోక అధికారులు తలలపట్టుకుంటున్నారు. మరోవైపు ఏమి జరుగుతుందో అని బరిలో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ కు గురవుతున్నారు. తీర్పు వచ్చాక వార్త వ్రాయడానికి సిద్ధంగా విలేకరులు, మీడియా పడిగాపులు కాస్తుంది. డ్యూటీ కి వెళ్ళాలా వద్దా అని ఉద్యోగులు తీర్పు కోసం టీవీ ల ముందు కూర్చొని, నిద్ర రాకుండా టీ, కాఫి పెట్టడానికి భార్యను మేల్కొని ఉండమని చెప్పటం రేపు పాటశాల/కళాశాల లకు పోవాల వద్దా అని తీర్పు కోసం విద్యార్థులు కూడా రాత్రి జాగారం చేస్తున్న విచిత్ర పరిస్థితి నేడు నెలకొంది. ప్రతిపక్షాలు ఏమో కాని అధికార పార్టీ కార్యకర్తలు మాత్రం కంటిలో ఒత్తులు వేసుకొని నాయకుల ఇంటి దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో తొలిసారి ఇలాంటి విచిత్ర పరిస్థితి నెలకొందని పలువురు చెబుతున్నారు.
*అయినా చేసేదేముంది..! అర్ధరాత్రి స్వాతంత్రం వస్తుందన్నట్లు తీర్పు కోసం నిద్ర లేకుండా పడిగాపులు కాయడం తప్ప….*

Leave A Reply

Your email address will not be published.