సింహాచలం దేవస్థానంలో పిఆర్వో నియామకం

సింహాచలం దేవస్థానం పి ఆర్ ఓ ,ఫోటో గ్రాఫర్ ను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించామని దేవస్థానం ఈవో సూర్య కళ తెలిపారు.

ఈరోజు ఉదయం దేవస్థానం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో దేవస్థానం పి ఆర్ ఓ గా లోకేష్,మరియు ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ ను నియమిస్తున్నామని ఆమె తెలిపారు.
దేవస్థానం సమాచారం మీడియాకు అన్ని విధాలుగా అందే విధంగా వీరు పని చేస్తారని ఆమె అన్నారు.
సింహాచల దేవస్థానం ప్రతిష్టను దేశం నలుమూలల తెలియజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు
కాంట్రాక్ట్ పద్ధతిలో పి ఆర్ ఓ కు నెలకు 50 వేలు, ఫోటోగ్రాఫర్ కు నెలకు 25 వేలు చెల్లిస్తామన్నారు
వీళ్ళ కాలపరిమితి ఒక సంవత్సరం ఆమె తెలియజేశారు.
వివిధ రకాల పత్రికా రంగాల్లో ,మీడియా రంగాల్లో పని చేసిన అనుభవం ఉన్న నాకు కొత్తగా పి ఆర్ ఓ గా దేవస్థానం లో పనిచేసే అవకాశం నాకు కలగడం నా పూర్వజన్మ సుకృతం అని పి ఆర్ ఓ లోకేష్ తెలిపారు

Leave A Reply

Your email address will not be published.