గుడులను కూల్చిన పా‌ర్టీకి ఓటు చేటు:పవన్

తిరుపతి: రాష్ట్రంలో సుమారు 153 గుడులను కూల్చిన వైసీపీ పార్టీకి ఓటు వేయవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారు. రాముడి తల నరికిన దుండగులను ఇప్పటి వరకూ ప్రభుత్వం పట్టుకోవడం లో విఫలమైందని ఆరోపించారు దుర్మార్గపు చర్యలకు దిగుతున్న వైసీపిఓటు వేస్తే వేంకటేశ్వర స్వామిని అవమానించినట్లేనని పవన్ వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీకే ఓటును వేయవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దేశభక్తి, దైవ భక్తీ పుష్కలంగా ఉన్న పార్టీ భాజపా అని తిరుమల శ్రీవారి సాక్షిగా బాగా పని చేస్తుందని ఆయన చెప్పారు. Pawan Kalyan leaves Annavaram for a new rally

Leave A Reply

Your email address will not be published.