మన్యంలో పోటెత్తిన ఓటరు

మన్యంలో ఓటింగ్ కు పోటెత్తిన ఓటర్లు..

విశాఖ మన్యం జీకేవీధి ,కొయ్యూరు ప్రాంతాల్లో ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల కు ఓటర్లు బారులు తీరారు. మన్యం ప్రాంతాలలో మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ కట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లకు అవగాహన కల్పించారు.

Leave A Reply

Your email address will not be published.