11 నుంచి 14 వరకూ టీకా ఉత్సవం: ప్రధాని

ఢిల్లీ : అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ .

కరోనా వల్ల మరోసారి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది .

కరోనా కట్టడికి సీఎంలు చర్యలు తీసుకోవాలి .

మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్ గఢ్, పంజాబ్ లో తొలిదశ కంటే ఎక్కువ తీవ్రత ఉంది .

పలు రాష్ట్రాల్లో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు .

వ్యాక్సినేషన్ కన్నా టెస్ట్ లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి .

ఆర్‌టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలి .

అందరూ తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలి .

కోవిడ్ పై పోరాటానికి మళ్లీ యుద్ధప్రాతిపదికన సిద్ధం కావాలి .

ఫస్ట్ వేవ్ ను జయించాం.. సెకండ్ వేవ్ ను కూడా జయించగలం .

దేశ వ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ ఉండదు .

కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ ఒక ప్రత్యామ్నాయం .

ఈ నెల 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ .

45 ఏళ్లు దాటినవారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి : ప్రధాని మోదీ

Leave A Reply

Your email address will not be published.