కోవిడ్ వ్యాక్సీన్ ప్రక్రియ వేగవంతం చేయండి: సిఎస్ దాస్

 

*కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి*
*రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్*

విశాఖపట్నం, ఏప్రిల్ 6: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆయన అమరావతి నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సవాలుగా తీసుకో వాలని, నివారణా చర్యలను పటిష్టంగా వేగంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలందరికీ అవగాహన కల్పించాలని 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ తప్పక టీకా వేయాలన్నారు. గ్రామ వార్డు వాలంటీర్ ల సేవలను వినియోగించు కోవాలన్నారు.

అమరావతి నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో
వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి
అనిల్ కుమార్ సింఘాల్, కమిషనర్ కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు. విశాఖపట్నం నుండి జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సూర్యనారాయణ, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.