జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలో బిజెపి
*అమరావతి :
భాజపా స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు ఎదుర్కొంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ప్రకటించారు.ఈ ఎన్నికల్లో భాజపా అసలైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తుందన్నారు. భాజపా ఇతర పార్టీలలాగ అధికారం వున్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా వ్యవహరించదనని అన్నారు. ఎప్పుడూ ప్రజాసేవలో ఉంటామన్నారు. భాజపా ఎన్నికల నుంచి ఎప్పుడు తప్పుకోదని ప్రజాక్షేత్రంలో వైసీపీ దౌర్జన్యాలను ప్రజలతో కలసి ఎదుర్కొంటుందని చెప్పారు. భాజపా అవకాశవాద రాజకీయాలు చేయరన్నారు. వైసిపిని ఎదుర్కోగల సత్తా భాజపాకు మాత్రమే ఉందనే విషయం మరోసారి నిరూపితమైందన్నారు. ప్రజలు రాష్ట్రంలో భాజపాని మాత్రమే నిజమైన ప్రతిపక్షంగా ప్రజలు నమ్ముతున్నారని, దానిని బాజపా మరింత బాద్యతగా ప్రజలకోసం రాష్ట్రంలో భాజపా నిజమైన ప్రతిపక్ష పాత్ర పోసిస్తుందని చెప్పారు.
ఈ ఎన్నికలలో భాజపా అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని,అధికార పార్టీ దుర్మార్గాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఇదేనన్నారు. ఒక జాతీయ పార్టీగా ప్రజలతో బాజపా కలిసి ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల ఈ ఎన్నికల్లో ఓటర్లు భాజపా బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలనని విజ్ఞప్తి చేశారు. భాజపా కార్యకర్తలు అధికారపార్టీ దౌర్జన్యాలను ప్రజాక్షేత్రంలో 20 నెలలు పైగా ఎదుర్కొని పనిచేస్తున్నాం అని, ఈ ఎన్నికల్లో కూడా అదేవిధంగా ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలవాలనుకునే అధికారపార్టీ కుతంత్రాలకు బెదిరేది లేదన్నారు. రాజ్యాంగపరంగా ఉన్న అన్ని హక్కులను ఉపయోగించుకోవడం ద్వారా ,మరియు అవసరమైతే న్యాయస్థానాలు, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి భాజపా అభ్యర్థులు అండగా ఉండి పోటీలో ఉన్న మా కార్యకర్తలకు అండాగా ఉంటామని అయన ఓక ప్రకటనలో తెలిపారు.