*న్యూఢిల్లీ*

_*సుప్రీంకోర్టులో సగం సిబ్బందికి కరోనా.. ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే విచారణ*_

*కోర్టు గదులు, ఆవరణను శానిటైజ్ చేస్తున్న అధికారులు*

*- నేడు ఓ గంట ఆలస్యంగా ప్రారంభం కానున్న విచారణ*

*- దేశంలో వరుసగా ఆరో రోజూ లక్ష దాటిన కేసులు*.

★ ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ సుప్రీంకోర్టులో 50 శాతం సిబ్బంది మహమ్మారి బారిన పడడం కలకలం రేపుతోంది.

★ దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు రూముతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు.

★ కోర్టులోని సగం మంది సిబ్బంది వైరస్ బాధితులుగా మారడంతో ఇక నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసులను విచారించాలని న్యాయమూర్తులు నిర్ణయించారు.

★ తాజా కలకలం నేపథ్యంలో కోర్టు బెంచ్‌లన్నీ నేడు ఓ గంట ఆలస్యంగా కేసుల విచారణను ప్రారంభించనున్నాయి.

★ కాగా, శనివారం ఒక్క రోజే 44 మంది సిబ్బంది కరోనా పాజిటివ్‌గా తేలింది.

★ _*‘‘నా సిబ్బందిలోని చాలామంది లా క్లర్కులు కరోనా బారినపడ్డారు’’*_ అని ఓ న్యాయమూర్తి తెలిపారు.

★ గతంలో కొంతమంది న్యాయమూర్తులు కరోనా బారినపడినా ఆ తర్వాత కోలుకున్నారు.

★ ఇండియాలో గత కొన్ని వారాలుగా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.

★ గత వారం రోజుల్లో ఏకంగా పది లక్షల కేసులు వెలుగు చూశాయి.

★ రోజువారీ కేసుల సంఖ్య వరుసగా ఆరో రోజు కూడా లక్ష మార్కును దాటింది.

★ నేడు ఏకంగా 1,68,912 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం.

★ అలాగే, 904 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.