మాస్క్ ధారణ వల్లే కరోనా నియంత్రణ

కోవిడ్ విస్తరణను ఆపడానికి మాస్క్ ధరించడం తప్పని సరి
కరోనా అవగాహనా కార్యక్రమాలను నిర్వహించిన ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్, అమీర్ పేట

7 ఏప్రిల్ ను ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్ పేట వారు అమీర్ పేటలో కరోనా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా హాస్పిటల్ సిబ్బంది మరియు సుల్తాన్ ఉలూమ్ ఫార్మసీ కాలేజీ కి చెందిన విద్యార్థులు కరోనా ను అరికట్టడం తో పాటూ తప్పని సరిగా మాస్క్ ఎందుకు దరించాలనే అంశం తో పాటూ కోవిడ్ టీకా వేసుకోవడం, సమాజిక దూరాన్ని పాటించడం అన్న అంశాలపై అవగాహన కలిగించే కరపత్రాలను ప్రజలకు, వాహన దారులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ నియంత్రణలో మాస్క్ తప్పని సరిగా ధరించాలన్న నియమాన్ని ఆవశ్యకతను తెలియజేశారు.

ఈ అవగాహనా కార్యక్రమాలను శ్రీ కె సైదులు, ఇన్స్పెక్టర్, యస్ ఆర్ నగర్ వారు నేటి ఉదయం ప్రారంభించారు. శ్రీ పివి గణేష్ తో పాటూ ఈ కార్యక్రమంలో శ్రీ కెటి దేవానంద్, ఛీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, డా. సతీష్ రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ – డా. రఘు, సీనియర్ ఇంటర్వేన్షనల్ కార్డియాలజిస్టు మరియు డైరెక్టర్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ – డా. రాజు, సీనియర్ న్యూరో మరియు స్పైన్ సర్జన్, మేనేజింగ్ డైరెక్టర్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ – శ్రీ ఏ వి రావు, మార్కెటింగ్ హెడ్, శ్రీ శ్రీనివాసులు మరియు పెంచల్ రెడ్డి, మార్కెటింగ్ సిబ్బంది, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ కె సైదులు, ఇన్స్పెక్టర్, యస్ ఆర్ నగర్ వారు మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి ఎందుకు తప్పని సరిగా మాస్క్ ధరించాలన్న విషయాన్ని వివరించి ప్రజలందరూ తప్పని సరిగా మాస్క్ ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. సరైన కారణం, పని లేకుండా ప్రజలు బయట తిరగడం తగ్గించాలని ఒక వేళ తిరగాల్సి వస్తే వ్యాధి బారిన పడకుండా అన్ని రకములైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం డా. సతీష్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను ప్రజలు ఖచ్చితంగా పాటించాలని సూచిస్తూ వ్యాధి తగ్గిపోయింది మనల్నేం చేస్తుందన్న నిర్లక్ష్యం వహిస్తే కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దీంతో పాటూ ప్రభుత్వ నిబందనల ప్రకారం ప్రజలందరూ ఎటువంటి సందేహాలు, భయాందోళనలకు లోను కాకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని అంటూ అది మాత్రమే వ్యక్తిని కోవిడ్ బారి నుండి కాపాడగలుగుతుందని డా. సతీష్ రెడ్డి వివరించారు.

తర్వాత కోవిడ్ మహమ్మారి విసురుతున్న సవాళ్లను డా రాజు వివరిస్తూ, ఒక వేళ కోవిడ్ కు సంబంధించిన లక్షణాలు ఏమాత్రం ఉన్నా సందేహించకుండా వెంటనే వైద్యులను సంప్రదించి కోవిడ్ నిర్థారణ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కోవిడ్ నిర్థారణ పరీక్ష నిర్వహించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే తమకు తెలియకుండానే తమ దగ్గరి వారికి కోవిడ్ వ్యాప్తికి కారణం అవుతారని హెచ్చరించారు. అందుకే సందేహం వచ్చిన తర్వాత తమకు తోచిన స్వీయ వైద్యం చేసుకోకుండా వెంటనే ఆలస్యం చేయకుండాసరైన వైద్యులను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇలా రోజంతా నిర్వహించిన ఆ అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ కు చెందిన ఆస్టర్ వాలంటీర్స్ కోవిడ్ పై తగిన సమాచారంతో కూడిన కరపత్రాలను పంచడమే కాకుండా మాస్క్ తప్పని సరిగా ధరించాలనే సూచనలను అమీర్ పేట మెట్రో స్టేషన్, యస్ ఆర్ నగర్ పోలిస్ స్టేషన్ మరియు అమీర్ పేటలోని కనకదుర్గ మందిరం వద్ద స్థానిక పోలీసుల సహకారంతో నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.