ఎవరితోనూ పొత్తులు ఉండవు… వైఎస్సార్ పేరు చాలు: వైఎస్ షర్మిల

త్వరలోనే తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్న వైఎస్ షర్మిల నేడు 10 జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో నిర్వహించబోతున్న సభకు సంబంధించిన పోస్టర్ ను ఆమె ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫిబ్రవరి 9 నుంచి తాను ఎంతోమందిని కలిశానని, ప్రతి ఒక్కరూ రాజన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలని కోరుతున్నారని వెల్లడించారు. ఏప్రిల్ 9న వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించిన రోజని, అందుకే ఆ రోజున బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

రాష్ట్రంలో పరిస్థితుల పట్ల ఎవరూ భయపడాల్సిన పనిలేదని, తానున్నానని షర్మిల భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారం సాధిస్తుందని ధీమా వెలిబుచ్చారు. తమ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని, వైఎస్సార్ పేరు చాలని ఉద్ఘాటించారు.

Leave A Reply

Your email address will not be published.