అయ్యా కేటీఆర్, మా ఏడుపు మేము ఏడుస్తాం.

ఆంధ్రప్రదేశ్ మీద, మీకు అంత ప్రేమ ఉంటే, మీ చేతిలో ఉన్న, ఈ కింద వాటి సంగతి చూడండి. మీ నుంచి మాకు రావాల్సినవి ఇవి…

* రెండు రాష్ట్రాలమధ్య రూ.లక్షా 97 వేలకోట్ల ఆస్తుల పంపకాలు పెండింగ్ లో ఉన్నాయి.
* 9 వ షెడ్యూల్ లోని 85 సంస్థల్లో ఆస్థుల విభజన సంగతి ఏంటి ? వీటిల్లో ఆంధ్ర కు రావాల్సిన వేల కోట్ల ఆస్తులు ఎప్పుడు మాకు ఇస్తారు ?
* 10 వ షెడ్యూల్ లోని 145 సంస్థల సంగతి ఏంటి ? అవి ఎప్పటికి విభజింప బడతాయి? వీటిల్లో ఆంధ్ర కు రావాల్సిన 30 వేల కోట్ల ఆస్తులు ఎప్పుడు మాకు ఇస్తారు ?
* ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌ ఆస్తులకి సంబంధించి రూ.5,500 కోట్లు పంపకాల సంగతి ఏంటి ?
* ఏపీజెన్‌కోకు తెలంగాణ డిస్కంలనుంచి రూ.5,700కోట్లు రావాల్సిఉంది, అవి ఎప్పుడు ఇస్తున్నారు ?
* వేలాదిఉద్యోగుల సమస్య అలానే ఉంది
* నీటి పంపకాల విషయంలో, కొర్రీలు పెడుతూనే ఉన్నారు
* పోలవరం పై ఇప్పటికీ సుప్రీం కోర్టులో కేసు వేసి, అడ్డు పెట్టి కూర్చున్నారు.

Leave A Reply

Your email address will not be published.