అన్నవరం నుంచి కొత్తపాకలకు ర్యాలీగా బయల్దేరిన పవన్ కల్యాణ్
తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో దివీస్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలకు మద్దతుగా జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ సభ నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి కిందటే రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అన్నవరం నుంచి ర్యాలీగా కొత్తపాకల బయల్దేరారు.
కొత్తపాకలలో ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. దివీస్ పరిశ్రమ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. పవన్ వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జిల్లా నేతలు ఉన్నారు. అంతకుముందు జనసేనానికి అన్నవరంలో ఘనస్వాగతం లభించింది. కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు.
Tags: Pawan Kalyan, Kothaapa kala, Annavaram, Divis, East Godavari District, Janasena