4000వేల కోసం పెట్రోల్ పోసుకొని యువకుడి మృతి.!

అనంతపురంలోని కలెక్టరేట్ ఎదుట గూగూడు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లి అయిన రామలక్ష్మి డ్వాక్రా గ్రూప్ లో ఉంది. ఆ గ్రూప్ కు 40000 రాగా ఆ డబ్బుల్లో రాములక్షమి కి రూ.4000 రావాలి. ఆ నగదును డ్వాక్రా సభ్యులు రాములక్ష్మికి ఇవ్వలేదు. మాకు రాలసిన డబ్బులు ఎందుకు ఇవ్వలేదని డ్వాక్రా సభ్యులను అడగ్గా సరైన సమాధానం వారు ఇవ్వలేదు. దీంతో సోమవారం స్పందన కార్యక్రమం లో అర్జీ ఇవ్వడానికి వచ్చాడు. అధికారితో మాట్లాడిన అనంతరం రాజశేఖర్ రెడ్డి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి కలెక్టరేట్ ఎదుటే మరణించాడు.

Leave A Reply

Your email address will not be published.