ఆ బస్సులో ఏం జరిగింది.. లోకేష్ ఏం చెప్పారు….
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం జిల్లా పర్యటనలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. జిల్లా పర్యటన ముగింపు సమయంలో లోకేష్ ఒక ప్రత్యేక వాహనంలో జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. నియోజకవర్గ బాధ్యులుగా ఉన్నవారంతా వాహనంలోకి వెళ్లారు. అయితే అక్కడ లోకేష్ ఏం చెప్పారన్నది సస్పెన్స్ గా మారింది. కొంత మంది అందించిన సమాచారం మేరకు బస్సులో కొందరి నాయకులకు పరోక్షంగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో బహునాయకత్వంతో నష్టం జరుగుతోందని.. గతంలో కూడా ఇలానే వ్యవహరించి దెబ్బ తిన్నారని.. ఈ సారి అలాంటివి ఉండకూడదన్నారు. అలాగే నాయకులంతా ఇక నుంచి యాక్టీవ్ కావాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే జిల్లా నేతలు ఎలాంటి అంశాలు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారన్నది తెలియరాలేదు.